YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 18 June 2012

నూతన మద్య విధానం ప్రకటించిన ప్రభుత్వం

నూతన మద్యం విధానం రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. మద్యం పాలసీ విధివిధానాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేసింది. మద్యం విధానంలో 6 స్లాబ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 10 వేల జనాభా వరకు షాపు లైసెన్స్ ఫీజు రూ.32.5లక్షలుగా, 10 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.34లక్షలుగా, 50 వేల నుంచి 3 లక్షల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.42లక్షలుగా నిర్ణయించింది. ఇంకా 3 నుంచి 5లక్షల జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు రూ.46లక్షలుగా, 5 నుంచి 20లక్షలు జనాభా ఉంటే లైసెన్స్ ఫీజు 64 లక్షలు, జనాభా 20లక్షల కంటే ఎక్కువగా ఉంటే ఫీజు రూ.1.04 కోట్లుగా నూతన మద్య విధానంలో వెల్లడించింది.


జులై 1 తేది నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం షాపులు ప్రారంభమవుతాయని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. కొత్త మద్యం షాపుల దరఖాస్తుకు ఈ నెల 25 చివరి తేది అని తెలిపారు. జూన్ 26 తేదిన న లాటరీ పద్ధతిలో కొత్త మద్యంషాపుల ఎంపిక చేస్తామన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!