YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Friday 15 June 2012

ప్రజల ఇచ్చిన విజయం: విజయమ్మ

జగన్ ను అందరూ ఒంటరి చేసినా ప్రజలు అండగా నిలిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆమె శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఇది దేవుడు, ప్రజలు ఇచ్చిన విజయమని అభివర్ణించారు.

తమకు అండగా నిలిచిన నేతలకు, పార్టీ కార్యకర్తలకు విజయమ్మ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల అండతో 2014 ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ ఇంకా ప్రజల గుండెల్లో నిలిచిపోయి ఉన్నారనటానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.


 ప్రజలు తమవైపే ఉన్నారని తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజలు గుర్తిస్తారని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వై ఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్ భారతి అన్నారు. జైల్లో ఉన్నా కూడా జగన్‌ ధైర్యంగానే ఉన్నారని ప్రజల అండదండలతో ఆయన బయటకు వస్తారని వై ఎస్‌ భారతి చెప్పారు. వైఎస్‌ఆర్‌ అభిమానులే తమకు అండని ఫలితాలు కూడా అలాగే ఉంటాయని ఆమె చెప్పారు. వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఇబ్బందులున్నా ప్రజల మద్దతులో గెలుస్తామని ఆమె చెప్పారు. జగన్‌ అరెస్ట్ జరిగినా ముగ్గురం మహిళలం ప్రజల మద్దతుతో ముందుకు కదులుతున్నామని చెప్పారు.జనం మధ్యన ఉన్న నేతను... జైల్లో పెట్టినా.... జనం మాత్రం ఆయనను గుండెల్లో పెట్టుకున్నారని వైఎస్ భారతి అన్నారు.


 ప్రజలు, దేవుడు ఇచ్చిన తీర్పు అని వైఎస్ఆర్ కుమార్తె షర్మిలా వ్యాఖ్యానించారు. టీడీపీ, కాంగ్రెస్, పోలీసులు ఏకమైన ప్రజలకు తమ పక్షాన నిలబడ్డారని ఆమె అన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చడాన్ని ప్రజలు జీర్ణీంచుకోలేకపోయారని ఆమె అన్నారు. జగనన్నను జైలులో పెట్టడాన్నిప్రజలు సహించలేకపోయారన్నారు. కష్టమంతా జగనన్నదే అని షర్మిల అన్నారు. రైతుల పక్షాన నిలిచిన రాజన్న రాజ్యం త్వరలోనే వస్తుందన్నారు. మెజార్టీ వచ్చినా, రాకున్నా తమ వెంట వున్నవారంతా తమకు ముఖ్యమేనన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ కావడంతో ప్రజలు కసితో వైఎస్ఆర్ సీపీకి ఓటు వేశారని షర్మిల అన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!