అనంతపురం : ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధితో వైఎస్ఆర్ పాలన సాగించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళవారం తాడిపత్రి బస్టాండ్ సర్కిల్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 26 జీవోలను వైఎస్ఆర్ ఒక్కరే జారీ చేయాలేదని కేబినెట్ నిర్ణయంతోనే జీవోలు జారీ అయ్యాయన్నారు. జగన్ పై అక్రమంగా కేసులు పెట్టారని విజయమ్మ అన్నారు.
అంతకు ముందు షర్మిల మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాజన్న రాజ్యానికి నాంది పలికినవారు అవుతారని అన్నారు. వైఎస్ఆర్ ఇచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ ఆ కుటుంబాన్నే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జరగబోయే ఉప ఎన్నికలపై దేశవ్యాప్తంగా దృష్టి ఉందని, ఓటు ద్వారా నియంతలు వంటివారికి బుద్ధి చెప్పాలని షర్మిల ఓటర్లకు పిలుపునిచ్చారు. అక్రమంగా జగన్ ను జైల్లో పెట్టాలని చూస్తున్నారని ఆమె అన్నారు.

No comments:
Post a Comment