YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday 20 June 2012

వేణు చెబుతున్న బొత్స తీన్ మార్( Petition Against Botcha in High Court).బండ్ల గణేష్‌ మర్డర్‌ చేసినా- బొత్స రక్షిస్తారా..?

అవినీతి ఆరోపణల్లో నిండా మునిగిన బొత్స సత్యనారాయణ తీన్‌మార్‌ కథ ఇది..! లిక్కర్ దందా, ఇసుకదందాలు చేస్తున్నట్లు విమర్శలున్న సత్తిబాబు... సైలంట్‌గా సినిమాలు తీస్తున్నారు..! బొత్స సినిమా బిజినెస్‌కు బినామీ... బండ్ల గణేష్‌.! ఇది ఎవరో చెబుతున్న మాటలు కాదు..! బొత్స అవినీతిపై విచారణ జరిపించాలంటూ హైకోర్టులో పిటిషన్‌ వేసిన ఎమ్మెల్యే వేణుగోపాలచారి చెబుతున్న - రియల్‌ స్టోరీ..!

బండ్ల గణేష్‌ మర్డర్‌ చేసినా- బొత్స రక్షిస్తారా..? ఏం మాటలివి..! తీన్‌మార్‌ ఆడియో ఫంక్షన్‌లో ఇన్ని మాటలు మాట్లాడే ధైర్యం- బండ్ల గణేష్‌కు ఎక్కడిది..? అని అప్పట్లోనే అందరూ ముక్కున వేలేసుకున్నారు. అభిమానం ఉంటే ఉండొచ్చేమోగానీ... మరీ ఇంత బరితెగింపా..? ఈ మాటల్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు- ముధోల్‌ ఎమ్మెల్యే వేణుగోపాలచారి. బొత్స అవినీతిపై విచారణ జరిపించాలంటూ - ఆయన హైకోర్టును కోరారు. 
బండ్ల గణేష్‌ తన మనిషి అని బొత్స సత్యనారాయణ చెప్పారు. పైగా అయితే ఏంటట అనేవిధంగా విజయనగరంలో మాట్లాడారు. 

బొత్సతో సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే- బండ్ల గణేష్‌- పలువురిని బెదిరిస్తున్నాడని- వేణుగోపాలచారి తన పిటిషన్లో వివరించారు. క్రౌన్‌ మూవీస్‌ డిస్ట్రిబ్యూటర్లయిన సుబ్బారావు, మధుసూధనరావులకు 91లక్షల 50వేల రూపాయలు మోసం చేశాడని తెలిపారు. ఇచ్చిన డబ్బు కావాలని అడిగితే- తీవ్ర పరిణామాలుంటాయని- గణేష్‌- వారిని బెదిరించాడని చెప్పారు. గణేష్‌కు భయపడి... సుబ్బారావు- ఈ ఏడాది మే నెల ఐదో తేదీన CCS పోలీసులకు ఫిర్యాదు చేశారనీ, ఇంతవరకు ఎటువంటి చర్య లేదని- వేణుగోపాలచారి - హైకోర్టు దృష్టికి తెచ్చారు. 

బొత్స అండదండలతో- బండ్ల గణేష్‌- ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని- 2700 గజాల భూమి విక్రయ వ్యవహారంలో- ఇలాగే బెదిరించాడని- ఎమ్మెల్యే పిటిషన్‌లో తెలిపారు. పరమేశ్వర ఆర్ట్స్‌ బ్యానర్‌పై  బండ్ల గణేష్‌ ఇంతవరకు మూడు సినిమాలు తీశారు... కాదు కాదు బొత్స తీయించారు. ఆ సినిమాలు- ఆంజనేయులు, తీన్‌మార్‌, గబ్బర్‌సింగ్‌. నష్టాలమీద నష్టాలు వచ్చినా... ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలను బండ్ల గణేష్‌ ఎలా ఖర్చుపెట్టగలిగాడు..? సినిమాల్లో  చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న బండ్ల గణేష్‌కు- ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడివి..! గణేష్‌ వెనుకున్న అదృశ్య హస్తం ఎవరిది..?

బొత్స, బండ్ల గణేష్‌ మధ్య బినామీ బంధాన్ని తేల్చాలనీ- వేణుగోపాలచారి కోర్టు మెట్లెక్కారు. లిక్కర్‌ దందా, సినీ బినామీతోపాటు- బొత్సకు ఇసుక మాఫియాతో బలమైన బంధం ఉందని- వేణుగోపాలచారి తెలిపారు. పరమేశ్వర ఆర్ట్స్‌ బ్యానర్‌పై బండ్ల గణేష్‌తో సినిమా తీయిస్తున్న  "తీన్‌మార్ బొత్స" భరతం పట్టాలని- వేణుగోపాలచారి 105 పేజీల పిటిషన్లో కోరారు... 

దర్యాప్తు నిస్పాక్షికంగా జరగాలంటే.. సీబీఐకి ఈ కేసును అప్పగించాలని వేణుగోపాలాచారి కోర్టును కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చీఫ్‌ సెక్రటరీ, సీబీఐ, ఐటీశాఖలను ప్రతివాదులుగా పిటిషన్‌లో ప్రస్తావించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!