ప్రతిపాడు, మాచర్ల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ఆశించిన టీడీపీకి ఉపపోరు ఫలితాలు శృంగభంగాన్ని మిగిల్చాయి. ఈ నియోజకవర్గాల్లో కమ్మ, బీసీ సామాజికవర్గాలు మొదటి నుంచి టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నాయి. అయితే ఈ ఉప ఎన్నికలలో మాత్రం ఈ రెండు వర్గాలు వైస్సార్సీపీకి అనుకూలంగా ఓటు వేశాయనేది ఫలితాల సరళిని బట్టి తెలుస్తోందని గుంటూరు జిల్లా నేతలు వెల్లడించినట్లు తెలిసింది. దీనికి తోడు గుంటూరులో జగన్‌పై సానుభూతి పవనాలు బాగా వీచినట్లు చెబుతున్నారు. ఉప ఎన్నికలకు ముందు జగన్ అరెస్టు చేయడం, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ప్రచారంతో రోడ్లపైకి రావడంతో సానుభూతి వెల్లువెత్తిందని గుంటూరు నేతలు పేర్కొన్నట్లు సమాచారం. దీనితో టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా వైస్సార్సీపీకి అనుకూలంగా నమోదయిం దన్నారు.
సానుభూతి ముందు అవినీతి ఆరోపణలు పెద్దగా ఓటర్లపై ప్రభావాన్ని చూపలేకపోయాయని నేతలు విశ్లేషించినట్లు చెబుతున్నారు. జగన్ అవినీతిని అంశాన్ని ప్రజల్లో ఆదే పనిగా మోతాదుకు మించి ప్రచారం చేయడంతో శృతి మించి కూడా పార్టీకి నష్టాన్ని కలిగించిందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ కూ డా తమ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, విధానాలను కూడా ప్రచా రం చేయకుండా కేవలం జగన్ అవినీతిని టార్గెట్ చేయడం వల్ల కూడా కాంగ్రె స్, టీడీపీలు దెబ్బతిన్నాయని నేతలు చంద్రబాబుకు వివరించినట్లు తెలుస్తోంది. కాగా దీనికి తోడు పార్టీ నాయకుల మధ్య సమన్వయం లోపం అభ్యర్థుల ఓటమికి దారితీసిందని చంద్రబాబు గుర్తించినట్లు తెలుస్తోంది. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లు ముఖ్యనేతలు వ్యవహరించారని క్షేత్రస్థాయి నేతలు విమర్శించినట్లు తెలుస్తోంది.
http://www.suryaa.com/Main/News/Article.asp?Category=1&SubCategory=2&ContentId=85864





No comments:
Post a Comment