టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్రలో అనేక అబద్దాలు చెబుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజాలు చెబితే తల పగిలిపోతుందని చంద్రబాబుకు శాపం ఉందని, అందుకే ఆయన ఎప్పుడూ నిజాలు మాట్లాడరని వైఎస్ఆర్ అంటూ
ఉండేవారని గుర్తు చేశారు. ఉచిత విద్యుత్ పై బాబు తన వ్యతిరేకతను ఇప్పటికీ చాటుతున్నారన్నారు. బాబు హయాంలో గ్యాస్ ధర రెండింతలు పెరిగింది వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంత కాలం గ్యాస్ సిలిండ్ ధర 305 రూపాయలు మాత్రమే ఉందని తెలిపారు. 9 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏ
ఒక్కరినైనా బాబు ఆప్యాయంగా పలకరించారా? అని ప్రశ్నించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలను వైఎస్ఆర్ సీపీ ఆతి త్వరలోనే తరిమి కొడుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని వైఎస్ విజయమ్మ కలవడం వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవన్నారు.
http://www.sakshi.com/Main/Breakingstory.aspx?catid=465160&Categoryid=14&subcatid=0

No comments:
Post a Comment