అనంతపురం: ఉపఎన్నికల్లో కాంగ్రెస్ 2, 3 సీట్లయినా గెలవాలన్న ఆశతో జగన్మోహన రెడ్డిని అరెస్ట్ చేయించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ఈ ఉపఎన్నికలు రాజకీయాలనే మార్చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతపురం ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఉపఎన్నికలు సువర్ణయుగానికి నాంది కావాలన్నారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు భూకేటాయింపులపై మాత్రం సీబీఐ విచారణ చేయలేదని చెప్పారు. కానీ మరణించిన వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చారని తెలిపారు.
వైఎస్ విజయమ్మ అనంతపురం వచ్చిన సందర్భంగా ఆమె సమక్షంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు చొవ్వా రాజశేఖర రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన రెడ్డి , మాజీ కార్పొరేటర్లు చొవ్వా గీతా, చొవ్వా మనోహర్, మాధవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

No comments:
Post a Comment