రాష్ట్రంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అంతటి అవినీతిపరుడు మరొకరు లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా తీవ్రస్థాయిలో విమర్శించారు. పోలవరం ఉప ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జగన్ ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు. చిరంజీవికి తమ పార్టీ అభ్యర్థుల గురించి మాట్లాడే నైతికహక్కు లేదన్నారు. ప్రజారాజ్యం పార్టీని ఎమ్మార్పీ రేటుకు అమ్మేసుకున్న చిరంజీవిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment