రక్షణ స్టీల్స్ కు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనీల్ కుమార్ కు ఎటువంటి సంబంధంలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు చెప్పారు. మీడియా కూడా వాస్తవాలు రాయాలని, ప్రజలు నమ్మే వార్తలు రాయాలని సలహా ఇచ్చారు. బ్రదర్ అనీల్ కుమార్ తో సంబంధం ఉందని నిరూపించగలరా? అని ఆయన సవాల్ విసిరారు. వైఎస్ కుమార్తె షర్మిల ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లడంతో ఆ కుటుంబాన్ని కూడా రచ్చకు ఈడ్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసే, అవాస్తవ కథనాలు రాసే పత్రికలపైన బ్రదర్ అనీల్ కుమార్ పరువునష్టం దావా వేయబోతున్నారని తెలిపారు. వారందరూ సమాధానం చెప్పవలసి ఉంటుందన్నారు. మత ప్రచారం చేసుకుంటున్న అనీల్ కుమార్ పై ఇటువంటి ఆరోపణలు చేయడం అన్యాం అన్నారు.
రక్షణ స్టీల్స్ కు చెందిన జె.అనీల్ కుమార్ అనే వ్యక్తి వేరని ఆయన తెలిపారు. వాస్తవానికి బయ్యారం భూములను కేవలం సర్వే చేయడానికి మాత్రమే రక్షణ స్టీల్స్ తో ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఆ భూముల విలువను 14 లక్షల వేల కోట్ల రూపాయలుగా ఎలా లెక్కగడతారని ఆయన ప్రశ్నించారు. దేశంలో అత్యంత ధనవంతులైన రిలయన్స్, టాటా వంటి పది మంది ఆస్తుల మొత్తం విలువే 14 లక్షల వేల కోట్ల రూపాయలని ఆయన వివరించారు. అంత అభూత కల్పనలను ఎవరో చెబితే మీడియా కూడా ఎలా రాస్తుందని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో కూడా లక్షల ఎకరాలను సర్వేకు ఇచ్చారని ఆయన చెప్పారు.
కోలా కృష్ణ మోహన్ చేసిన ఆరోపణలపై వివరణ ఇవ్వవలసిన అవసరం టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుపై ఉందని ఆయన చెప్పారు. వివరణ ఇవ్వడానికి ఆయన వారం రోజుల విచారణ అడిగారని తెలిపారు. నిజాయితీపరులైతే వారం రోజుల సమయం దేనికి అని ప్రశ్నించారు.

No comments:
Post a Comment