ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీ గురునాథరెడ్డికి మద్దతుగా వచ్చిన వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల మంగళవారం అనంతపురంలో నిర్వహించిన రోడ్‌షో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగింది. ఉదయం 11.45 గంటలకు కలెక్టరేట్ దగ్గర నుంచి ప్రారంభమైన రోడ్‌షో 3.15 గం టలకు గురునాథరెడ్డి ఇంటి దగ్గర ముగిసింది.
11.45 గంటలకు వైఎస్ విజయమ్మ కాన్వాయ్ కలెక్టర్ ఆఫీసు వద్దకు చేరుకోగానే వేలాది మంది ఈలలు కేకల మధ్య ఆ ప్రాంతం దద్దరిల్లింది. వైఎస్ విజయమ్మ రెండు చేతులు జోడించి నమస్కరించగా కుమార్తె షర్మిల చేత్తో అభివాదం చేయడంతో ప్రతిగా పార్టీ శ్రేణులు నినాదాలు మిన్నంటాయి.
12 గంటలకు రోడ్‌షో పవరాఫీస్‌కు చేరుకుంది. అప్పటికే ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. పాతూరు మెయిన్‌రోడ్డులోకి ప్రవేశించగానే రోడ్డుకు ఇరువైపులా, మిద్దెలు, మేడలపై నుంచి ముస్లిం మహిళలు, ప్రజలు మల్లెపూలు, బంతిపూలతో స్వాగతం పలికారు. 12.30 గంటలకు పాతూరులోని మాసుమాబీ దర్గాకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. 12.45 గంటలకు తాడిపత్రి బస్టాండ్ సర్కిల్‌కు చేరుకునేలోగా వేలాది మంది జనం పోటెత్తారు.
టీడీపీకి చెందిన సీకే పల్లి మాజీ జెడ్పీటీసీ ప్రమీల, ఆమె భర్త పుల్లారెడ్డి విజయమ్మ సమక్షంలో పార్టీలోకి చేరారు. తాడిపత్రి సర్కిల్‌లో ‘నేను జగనన్న చెల్లెలు.. పేరు షర్మిల’ అంటూ తనను తాను పరిచయం చేసుకున్న షర్మిలకు జనం జేజేలు కొట్టారు. మహానేత వైఎస్, వైఎస్ జగన్‌లు చెప్పినట్లుగానే అనంతపురం ప్రజలు ప్రేమించే వాళ్లుగా ప్రత్యక్షంగా చూస్తున్నానని వైఎస్ విజయమ్మ చెప్పడంతో జనం నుంచి విశేష స్పందన లభించింది.
1.25 గంటలకు తాడిపత్రి బస్టాండ్‌లో సభ ముగించుకుని తిలక్‌రోడ్డు మీదుగా రోడ్‌షో సాగింది. సూర్యానగర్ మెయిన్‌రోడ్డు, సాయినగర్, అంబేద్కర్‌భవన్, సాయినగర్ మెయిన్‌రోడ్డు మీదుగా రోడ్‌షో కొనసాగింది. మధ్యాహ్నం 2.10 గంటలకు స్థానిక మున్సిపల్ సర్కిల్‌లోని జగజ్జీవన్‌రాం విగ్రహం వద్దకు రోడ్‌షో చేరుకుంది. సప్తగిరి సర్కిల్, మున్సిపల్ సర్కిల్ ప్రాంతాలు అప్పటికే ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయాయి. మహానేత వైఎస్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై మున్సిపల్‌సర్కిల్‌లో అభ్యర్థి బీ గురునాథరెడ్డి ఆవేశపూరితంగా ప్రసంగించారు. మున్సిపల్ సర్కిల్ సభలో ప్రసంగం ముగిసిన తరువాత ఓ ముద్దుల చిన్నారికి ‘రాజశేఖర్‌రెడ్డి’ అని నామకర ణం చేశారు. పిల్లాడిని వైఎస్ విజయమ్మ, షర్మిలలు ముద్డాడారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సభ ముగించుకుని గుల్జార్‌పేట రోడ్‌షోకు బయలుదేరడంతో అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గుల్జార్‌పేటకు వెళ్లకుండా 2.45 గంటలకు నేరుగా అరవిందనగర్‌లోని చవ్వా రాజశేఖర్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన చవ్వాతో పాటు మరికొందరు ఈ సందర్భంగా విజయమ్మ సమక్షంలో పార్టీలోకి చేరారు. మధ్యాహ్నం 3 గంటలకు అరవిందనగర్‌లో ఉన్న బీ గురునాథరెడ్డి ఇంటికి చేరుకున్నారు. అక్కడ 2009 ఎన్నికల్లో పీఆర్పీ తరఫున అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేసిన మన్సూర్, మరికొందరు విజయమ్మ సమక్షంలో పార్టీలోకి చేరారు. 3.15 గంటలకు గురునాథరెడ్డి ఇంటి నుంచి బయలుదేరి రాయదుర్గం నియోజక వర్గానికి వెళ్లారు. - న్యూస్‌లైన్, అనంతపురం జిల్లాపరిషత్తు
పెద్దాయనా.. పెద్దాయనా ఇది స్వార్థపు లోకం.. అనంతపురం జిల్లాపరిషత్తు, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణించి వేయి రోజులు పూర్తయిన సందర్భంగా ఇటీవల రాష్ట్రమంతా మారుమోగుతున్న ‘పెద్దాయనా...’ పాట జనాన్ని కట్టిపడేస్తోంది. ఉప ఎన్నికల్లో భాగంగా బీ గురునాథరెడ్డికి మద్దతుగా మంగళవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్‌షో సందర్భంగా ‘పెద్దాయనా...’ పాట ప్రజలను పరవింపజేసింది.
పార్టీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రిలాక్స్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో కళాకారుల బృందం రోడ్‌షో ముందు భాగాన ప్రజలు ఉత్తేజితులను చేస్తూ సాగింది. అలాగే ‘జగనన్న జగనన్న’ అంటూ సాగే పాటకు సైతం జనం జేజేలు పలికారు. రోడ్‌షో ముందు భాగాన సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
రాయదుర్గంలో... ఇసుకేస్తే రాలనంత అఖండ జనవాహిని చూసి రాయదుర్గం ఈనిందా అంటూ రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సోనియమ్మ చెప్పిందంట.. సీబీఐ అరెస్ట్ చేసిందట... ఇది ఎంత అన్యాయం. (జగన్ అరెస్ట్‌ను ఉద్దేశించి) కాంగ్రెస్, టీడీపీ దుర్మార్గపు కుట్రలతో రోజుకో నిందలు వేస్తున్నారు. నా భర్తను నేనే చంపుకుంటానా..? (బొత్స సత్యనారాయణను విమర్శిస్తూ)ధర్మం మన పక్షాన ఉంది. జగనన్న త్వరలోనే బయటకు వస్తాడు. (షర్మిల)ఏ రోజు బయటకు వచ్చిన దాన్ని కాను, విధిలేని పరిస్థితిలో రావాల్సి వచ్చాను. నన్ను ఆదరించండి. (జగన్ బాబు జైలుకెళితే పార్టీ పరిస్థితి ఏమిటని కొందరి ప్రశ్నలకు సమాధానంగా విజయమ్మ) జగన్‌బాబు సీఎం క్యాంప్ ఆఫీస్‌కి ఏ రోజు వెళ్లలేదు. మరి తప్పులెలా చేస్తాడు. (విజయమ్మ) చంద్రబాబుకు హైదరాబాదు నడి బొడ్డున వందల ఎకరాల భూమి ఉంది. సీబీఐ వాటి వంక చూడలేదేమి? (విజయమ్మ) గాలి జనార్దనరెడ్డికి బెయిల్ ఇస్తే కూడా జగన్ మీద నిందలేనా...? (విజయమ్మ) నా భర్త మరణం పైన అనుమానాలున్నాయి. నివృత్తి కావాల్సి ఉంది. |
No comments:
Post a Comment