న్యూఢిల్లీ:రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయకూడదని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కలామ్ చేశారు. ఎన్డీఏ కూటమి తరపున పోటీచేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ కోరగా అందుకు కలామ్ సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. అయితే రాష్ట్రపతి ఎంపిక రేసు నుంచి కలామ్ తప్పుకోవడం మమతా బెనర్జీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. కలామ్ తాజా నిర్ణయంతో మమతా ఎలాంటి ఎత్తు వేస్తోందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కలామ్, సోమనాథ్ చటర్జీ, మన్మోహన్ సింగ్ పేర్లను మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. యూపీఏ ప్రతిపాదించిన ప్రణబ్ ముఖర్జీ అభ్యర్థిత్వంపై మమతా అనాసక్తిని ప్రదర్శిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment