వైఎస్ జగన్‌ను మరో మూడు రోజులు కస్టడీకి అప్పగించాలని కోరుతూ గురువారం సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. లంచ్ మోషన్ రూపంలో దీన్ని స్వీకరించ లేమని న్యాయస్థానం తెలిపింది. అత్యవసర పిటిషన్‌గా విచారణకు స్వీకరించలేమని స్పష్టం చేసింది. కస్టడీ కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ వేయొద్దని సీబీఐకి సూచించింది.
దీంతో కస్టడీ కోరుతూ సీబీఐ శుక్రవారం అనుబంధ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ నెల 9, 10 తేదీల్లో విజయసాయి రెడ్డిని ప్రశ్నించేందుకు పిలిచామని సీబీఐ కోర్టుకు తెలిపింది. ఈ సందర్భంగా జగన్‌ను కూడా విచారించాలని చెప్తూ సీబీఐ కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది.
వాస్తవానికి జగన్ అరెస్టు సందర్భంగా 10 రోజుల కస్టడిని సీబీఐ కోరింది. దీనిపై సీబీఐ, జగన్ తరపు న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు 5 రోజుల కస్టడీకి మాత్రమే అనుమతించింది. ఆదివారం మొదలైన విచారణ నేటితో ముగియనుంది.

No comments:
Post a Comment