రోడ్డు ప్రమాదాల నివారణకు ఒక జాతీయ వ్యవస్థీకృత విధానం ఉండాలనీ రాత్రి పూట డ్రైవర్లు ఏ స్థితిలో వాహనాలు నడుపుతున్నారో ‘ర్యాండమ్ చెక్’ నిర్వహించాలనీ వైఎస్సార్ కాంగ్రెస్ సూచించింది. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు డి.ఏ.సోమయాజులు మాట్లాడుతూ తాము ఈ మేరకు దేశ ప్రధాన మంత్రికి ఒక లేఖ రాస్తామని వివరించారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ నేతృత్వంలో ఎమ్మెల్యేలందరూ ఢిల్లీకి వెళ్లినపుడు ఇతర అంశాలతో పాటుగా ప్రధానికి రోడ్డు ప్రమాదాలపై కూడా ఒక లేఖను అంద జేస్తామని ఆయన తెలిపారు. షిరిడీకి నల్‌దుర్గ్ వద్ద రాష్ట్రానికి చెందిన బస్సు లోయలో పడి 30 మంది మృతి చెందిన సంఘటన పట్ల తమ పార్టీ తీవ్ర సంతాపాన్ని తెలియ జేస్తోందనీ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని కూడా తెలియ జేస్తున్నామని అన్నారు. రోడ్డు భద్రతలో లోపాలున్నాయని ఈ సంఘటన వల్ల మరో మారు బయట పడిందని ఆయన అన్నారు. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపేట గ్రామంలో జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన వారి కుటుంబాలను శనివారం విజయమ్మ పరామర్శించి వారిలో నైతిక స్థైర్యాన్ని నింపారనీ అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రమాధం బాధితులను కూడా ఆమె పరామర్శించి తన సానుభూతి తెలిపారని సోమయాజులు తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment