YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 18 June 2012

ఢిల్లీ నేతల వెన్నులో వణుకు!

వైఎస్ చనిపోగానే కొందరు భావించినట్టు జగన్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఎగబడలేదు. ఆ పెరపెరను ప్రదర్శించినవారు పదవీలాలసులైన కొందరు నాయకులు మాత్రమే. వారు తమ స్వార్థంకొద్దీ వైఎస్ పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తికాకముందే జగన్‌తో సంబంధం లేకుండా జగన్ ముఖ్యమంత్రిత్వం కోసం సంతకాల ఉద్యమం ప్రారంభించడం జనం కనిపెట్టకపోలేదు! వయసులో చిన్నవాడైనా జగన్, అధికారశక్తుల ఆదేశాలపైన ధర్మాధర్మ విచక్షణ లేకుండా సేవలందించే దర్యాప్తు సంస్థలు... న్యాయస్థానాల విమర్శలను, ఆదేశాలనూ కూడా దిక్కరించి వేధింపులకు తనను గురిచేస్తున్నా, వయసుకు మించిన ఆత్మనిగ్రహంతో అన్నిరకాల ఒత్తిళ్లను ఎదురొడ్డి మొనగాడుగా నిలబడ్డాడు. కాంగ్రెస్ అధిష్టానానికి జైలు వెలుపలా, బయటా కూడా ఆ వయసులో ఇంతటి ఝలక్ ఇచ్చిన యువకుడూ లేడు.

దేశ చరిత్రలో కొన్ని పరిణా మాలు ఒక్కో సందర్భంలో విషాదకరంగా పరిణమిస్తే, మరికొన్ని సన్నివేశాలు పరిహా సాస్పదంగా ముగుస్తుంటాయని సామాజిక, రాజకీయ శాస్త్ర చర్చల్లో ఒక నానుడి! వెనకటికొ కడు వాదన, హేతువు కోల్పో యి ఎదుటివాడి మీద ‘కసి’ కొద్దీ ఒళ్లంతా మసిపూసుకుని ఊరేగాడట. అలాగే కాంగ్రెస్ అధిష్టానవర్గం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖరరెడ్డి కుటుంబంపై కక్ష కట్టిన ఫలితంగా వచ్చిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ నాయకత్వం ఓటర్ల స్పష్టమైన తీర్పు ద్వారా పరిహాసానికీ, పరాభవానికీ గురికాక తప్పలేదు! 

ఈ ఫలితాలు కాంగ్రెస్‌కే కాదు, ప్రజాజీవితంలో ఉన్న నేటి, రేపటి రాజకీయ పక్షాలకూ, నాయకులకూ, కార్యకర్త లకు కూడా గుణపాఠం కావాలి. ఫ్యూడల్ సమాజంలో రాచరిక భూస్వామ్యశక్తులను ఎదిరించి తెగించి నిలవగల శక్తి ఆనాటి వర్గ సమాజంలో సామాన్య మధ్య తరగతి ప్రజాబాహుళ్యానికి చాలి ఉండకపోవచ్చు. ఆ పరిస్థితి ఎల్ల కాలం సాగదు. ధనిక వర్గానికి సర్వరక్షణ సంభారాలతో కాపలా కాసే పెట్టుబడిదారీ వ్యవస్థ తన దోపిడీని కొన సాగించుకోడానికి ప్రతి ఐదేళ్లకు ఒకసారి ‘ఎన్నికల’ చాటు న దాగినట్టే దాగుతూ అదే ‘ప్రజాస్వామ్య’ ముసుగును ఉపయోగించుకుని తనకు ఎదురు నిలిచే రాజకీయ ప్రత్యర్థుల్ని అణచడానికీ వెనుదీయదని, పెట్టుబడిదారీ నియంతృత్వ పార్లమెంటరీ రాజకీయాలు ఈ ఉప ఎన్నికల ద్వారా మరోసారి నిరూపించాయి! 

ఈ పూర్వరంగంలో చూస్తే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అనుమానాస్పద పరిస్థితుల్లో హెలికాప్టర్ దుర్ఘ టనకు గురికావడానికి ముందు ఆయనను దేశంలోనే ‘ఆదర్శ ముఖ్యమంత్రి’గా కితాబులిచ్చిన కాంగ్రెస్ అధి ష్టానం, ఆయన ఆకస్మిక మరణంతో ప్లేటు మార్చి రాష్ట్రం లో ఆయనకు ఉత్తరాధికారిగా (కాంగ్రెస్ సంస్కృతి ప్రకా రమే) ఆయన కుమారుడు, యువకుడు, సమర్థుడైన జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లోకి లేదా పాలనలోకి ఎక్కడ దూసుకువస్తాడోనని బెంగపెట్టుకుంది!

జగన్‌ను ‘అడ్డుకునే’ ప్రయత్నంలో అధిష్టానం చేసిన పనేమిటి? తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నడూ సచివాల యం గడపతొక్కి ఎరగని జగన్... వైఎస్ వారసుడిగా రాజ కీయరంగ ప్రవేశం చేస్తే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రం లోనూ బలాబలాల్లో కూడా మార్పు వచ్చే ప్రమాదం ఉం దని అధిష్టానం భయపడింది! పెట్టుబడివర్గ రాజకీయం లో ‘బలాబలా’లన్నవి కేవలం వ్యక్తులమీదనే ఆధారపడి ఉండవు, ఆర్థిక బలం కీలకమని అధిష్టానానికి తెలుసు. 

జాతీయస్థాయిలో అటు రాహుల్ దూసుకువస్తున్న సమయంలో, ఇటు అదే పార్టీకి చెందిన ఒక శక్తిమంతుడైన యువకుడిగా జగన్ దూసుకురావడం ఆ పార్టీ అధిష్టానా నికి ఇష్టం లేదు. మొదటి నుంచీ దక్షిణభారతం ఉత్తరాదికి చేదు! అందుకే హస్తినది చేదు రాజకీయం. కనుక కాం గ్రెస్‌లోని కొత్త కెరటాన్ని ఎలా నిలవరించాలి? 

కాంగ్రెస్ అధిష్టానం తమిళనాడులో జయలలితను, యూపీలో ములాయంసింగ్ యాదవ్‌ను లొంగదీసుకోవడానికి ఏ ప్రాతిపదిక మీద వారి మీద కేసులు బనాయింపజేయిం చిందో అలాగే జగన్ మీద కూడా బనాయించడం ద్వారా కాంగ్రెస్ ‘ఒర’ నుంచి తప్పించుకుపోయి, కాంగ్రెస్‌కే ‘ఏకు మేకయ్యే’ పరిస్థితి తలెత్తకుండా చూడాలనుకుంది. వైఎస్ పాలనా వ్యవహారాలతో సంబంధం లేని జగన్‌ను ‘స్థితికి మించిన ఆస్తులున్నాయన్న’ ఆరోపణపైన నేరుగా కేసులు బనాయించడం సాధ్యం కాదు. సచివాలయంలో అతను మంతనాలు జరిపి ‘ప్రతిఫలం’ పొందాడని ప్రత్యక్షంగా చెప్పడం కూడా కుదరదు. అందుకని కుట్రపూరితంగా ఓ పథకం పన్నింది.

‘చచ్చిన వ్యక్తి తల తూర్పుకు ఉన్నా ఒకటే, పడమ టికి ఉన్నా ఒకటే’లెమ్మనుకున్న అధిష్టానం జగన్‌ను సాధించడానికి దివంగత తండ్రి మీదుగా నిందారోపణల రథం నడిపింది. వైఎస్ హయాంలో మంత్రులందరి సమ క్షంలో యావత్తు మంత్రిమండలి ఒక్క భిన్నాభిప్రాయం కూడా నమోదు కాకుండా ఏకగ్రీవంగా ఆమోదించిన అంశాల ఆధారంగా రూపొందిన 26 జీఓలను తవ్విం చింది. 

ఆ తవ్వడం కూడా వైఎస్ మరణానంతరం ఏర్ప డిన మంత్రివర్గంలోని ఒక బడుగువర్గాల ప్రతినిధి ద్వారా రెండు పేజీల ఆరోపణలతో సంతకం లేని పిటిషన్‌ను న్యాయస్థానానికి సమర్పిస్తే దాన్ని అందుకున్న ఒక న్యాయమూర్తి పక్కన పెట్టగా, అధిష్టానానికి చెందిన ఒక ‘పెద్ద మనిషి’ (కాంగ్రెస్‌లోనే జగన్ ఉండిపోతే ఈ కేసులు ఉండేవి కావు కదా అని బయటపడిన ఒక అవకాశవాది) ద్వారా మరొక ప్రధాన న్యాయమూర్తికి (ఇప్పుడాయన వేరే ఉద్యోగంలో ఉన్నారు) అప్పగించి స్వీకరింపజేసేటట్టు చేశారు. అంటే దివంగత నాయకుడు ఎలాగూ సమాధానం చెప్పలేడు కాబట్టి, ఆ నాయకుడి హయాంలో వచ్చిన జీఓల ద్వారా జగన్ ‘సామ్రాజ్యం’ పెరిగిందని చెప్పాలని అధిష్టానం తహతహ. దీనికి అనుగుణంగానే ఉప ఎన్ని కలకు ముందు జగన్ అరెస్టు జరిగింది.

కాని పలు పార్టీ లతో కూడిన సంకీర్ణ కూటమిలో ఒక ప్రధాన భాగస్వా మిగా తప్ప తానుగా ఏక పక్షంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తిని 1996 నాటికే కోల్పోయిన జాతీయ కాంగ్రెస్‌ను అటు కేంద్రంలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో 2004లోనూ, 2009లోనూ కాపాడి అది అధికార పగ్గాలు చేపట్టడానికి తన 1,500 కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా అపూర్వ చైతన్యాన్ని ప్రజలలోనూ, క్యాడర్‌లోనూ కలిగిం చిన వైఎస్ సేవలు అంత త్వరలో అధిష్టానానికి ‘పరగ డుపు’ అయిపోవడమే వింతలలో వింతగా ప్రజలు భావించసాగారు. వైఎస్‌ను సాగనంపి అతని కొడుకు ఎదుగుదలకు అడ్డుగోడ కట్టజూచినందుకు 18 నియోజక వర్గాల ప్రజలూ వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ సంఖ్యలో కదిలివచ్చి ఓట్లు వేసి, 15 అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ పార్టీకి అప్పగించారు. 

వైఎస్‌ఆర్‌సీపీ అత్యల్ప కాలంలో, అనేక ఆటంకాల మధ్య ఈ ఘన విజయాన్ని సాధించడం విశేషం. పార్టీ అధ్యక్ష హోదాలో జగన్‌ను ప్రజల మధ్యకు రానివ్వకుండా బెయిల్ మీద కూడా జైలు నుంచి కదలనివ్వకండా, ఎన్ని కల ప్రచారంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తలను, అభ్యర్థులను వేధింపులకు గురిచేసినందుకు ఓటర్ల ఆగ్రహం కట్టలు తెంచుకున్న ఫలితమే ఈ అఖండ విజయం! 

ఒక దివంగత ముఖ్యమంత్రిపైన ఆరోపణల పర్వాన్ని తెరిచి దాని ఆధారంగా పెట్టుబడి వ్యవస్థ అనుమతించిన పరిధుల్లోనే ఒక ప్రత్యామ్నాయ రాజకీయశక్తిని ఎదిగిరానివ్వకుండా అడ్డుకునేందుకు సొంత పార్టీ అధిష్టానమే గజ్జెకట్టడం అభి నవ భారత రాజకీయంలో అవమానకర ఘట్టం! ఈ లెక్క న ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణల పేరుతో దేశంలోకి కాంగ్రెస్ అధిష్టానం దిగుమతి చేసిన విదేశీ విధా నాల ఫలితంగా దేశ ఆర్థికవ్యవస్థ... ముఖ్యంగా సన్నకారు రైతుల, బీదసాదల, చిన్న పరిశ్రమల నిర్వాహకుల బతుకులన్నీ మంటకలిశాయి. 

స్విస్ బ్యాంకుల్లో దాచిన భారతీయ మోతుబరుల నల్లధనం రూ.24 లక్షల కోట్లను దేశానికి తరలించుకు రాగలిగితే దేశ ఆర్థికవ్యవస్థ రూపురేఖలు మారి ప్రపంచ స్థాయిలో భారత్ అగ్రభాగాన నిలవడమేగాదు, దేశ దారి ద్య్రం కూడా తీరిపోతుంది! అమెరికా, స్వీడన్ దేశాల మహా కోటీశ్వరులు ఎగవేస్తున్న పన్నులను వసూలు చేసేం దుకుగాను వారు స్విస్ బ్యాంకులో దాచుకున్న నల్లధనాన్ని ఆ రెండు దేశాల పాలకులు తరలించుకుంటున్న వైనం తెలిసి ఇక్కడ మన పాలకులు గుడ్లప్పగించి చూస్తున్నారు.

పైగా నల్లధనానికి తెల్ల గుడ్డ తొడిగి దానిని ‘శ్వేతపత్రం’గా చదువుకోమంటున్నారు! కేంద్రం కనుసన్నలలో రూపొం దిన ‘పార్టిసిపేటరీ నోట్స్’... బడాబాబుల వ్యాపార ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిన హవాలా విదేశీ మారకపు దొంగడబ్బు చలామణీ మార్గాలకు అనుమ తించిన సాధికార మాధ్యమాలేనని ఆర్థిక నిపుణుల అంచనా! 

ఈ పూర్వరంగంలో నిఘా, దర్యాప్తు సంస్థల ద్వారా కాంగ్రెస్ అధిష్టానవర్గం జగన్‌పై తలపెట్టిన దాడులన్నీ రాజకీయకక్షతో కూడిన ఆర్థిక నేరారోపణలుగా ఉప ఎన్నికలలో ఓటర్లు భావించి ఉంటారు. తండ్రి మరణంతో ఆయన తలపెట్టి ఆచరించిన, ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శ పథకాలుగా నిరూపితమైన సంక్షేమ కార్యక్రమాలు ఇక మీదట తమకు దక్కవన్న బెంగతో ఆత్మహత్యల పాలైన పేద, బడుగువర్గాలకు చెందిన సుమారు 600 కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ తలపెట్టిన ‘ఓదార్పు’ యాత్ర విశేష ప్రజాదరణ పొందిన ఫలితమే ఉప ఎన్నికలలో వైఎస్సార్ పార్టీ ఘనవిజయం. ఇలా ఒక ముఖ్యమంత్రి చనిపోయినంతనే దిగాలుపడిన పరిస్థి తుల్లో అంతమంది చనిపోవడం దేశ చరిత్రలో ఏ రాష్ట్రం లోనూ జరగని పరిణామం. 

వైఎస్ చనిపోగానే కొందరు భావించినట్టు జగన్ తనకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఎగబడలేదు. ఆ పెరపెరను ప్రదర్శించినవారు పదవీలాలసులైన కొందరు నాయకులు మాత్రమే. వారు తమ స్వార్థంకొద్దీ వైఎస్ పార్థివ దేహానికి అంత్యక్రియలు పూర్తికాకముందే జగన్‌తో సంబంధం లేకుండా జగన్ ముఖ్యమంత్రిత్వం కోసం సంతకాల ఉద్యమం ప్రారంభించడం జనం కనిపెట్టకపో లేదు! 

ఓదార్పుయాత్రలో జగన్ తన తండ్రి పథకాల కొన సాగింపుపైన మాత్రమే కేంద్రీకరించాడు గాని, రాజకీయ ప్రత్యర్థుల్ని ఒక్కమాట కూడా తూలనాడింది లేదు. ఇదీ ఓటర్లు గ్రహించారు. జగన్ పార్టీ సాధించిన విజయం రాష్ట్ర రాజకీయాలనే కాదు, 2014 నాటి ఎన్నికలనే కాదు, దేశ రాజకీయ సమీకరణాలను, రాష్ట్రపతి ఎన్నికలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎన్టీఆర్ తర్వాత రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త రాజ కీయ శక్తిగా వైఎస్సార్ పార్టీ అవతరించడం, అందులోనూ రాష్ట్ర శాసనసభలో మూడవ పెద్ద రాజకీయ పక్షంగా నిల వబోవడం అత్యంత ఆసక్తికర పరిణామం. 

రామచంద్ర పురం, నర్సాపురం స్థానాల్లో కాంగ్రెస్ విజయానికి కార ణం టీడీపీ, కాంగ్రెస్‌తో మిలాఖత్ కావడం తప్ప మరొకటి కాదని ఓటర్లకూ అర్థమైపోయింది! పరకాలలో విజయం టీఆర్‌ఎస్ కోతలు కోసుకుంటున్నట్టు ‘సెంటిమెంటు’ది కాదు. ఎందుకంటే, గెలిచిన అభ్యర్థికన్నా కేవలం 1,562 తక్కువ ఓట్లతో అదే ‘సెంటిమెంటు’ వైఎస్సార్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖను కూడా ఆదరించిందని మరచిపో రాదు! ఇక కొన్ని నియోజకవర్గాలలో అయితే కాంగ్రెస్, టీడీపీలకు పడిన ఓట్లన్నీ, వైఎస్సార్ కాంగ్రెస్‌కు పోలైన ఓట్లకన్నా తక్కువ కావడం గమనార్హం! అలాగే కాంగ్రెస్, టీడీపీలకు అనేక నియోజకవర్గాల్లో డిపాజిట్లు గల్లంతు కావడం ప్రత్యేకించి గమనించదగిన విషయం! 

అంతేగాదు, 2009 నుంచి ఇంత వరకు రాష్ట్రంలో వివిధ కారణాల వల్ల 41 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపో వడం, ఆ పార్టీ కోల్పోతున్న ప్రజాదరణకు నిదర్శనం. కక్షలు కార్పణ్యాలతో పాటు చంద్రబాబు హయాంలో అంకురార్పణ చేసిన అవినీతి పాలనపై కూడా ఓటర్ల తీవ్ర నిరసనకు ఈ ఎన్నికలు ఓ తిరుగులేని నిదర్శనం. ఇక చిరంజీవి కాంగ్రెస్‌లోకి ఏదో ఆశించి వచ్చి భంగపడి చివ రికి కాంగ్రెస్ బడ్జెట్‌లో భారంగా తాజాగా చేరిన ‘వర్తమాన లోటు’ (కరెంట్ డెఫిసిట్)గా మిగిలిపోవలసివచ్చింది! అన్నింటికన్నా విశేషం ఆంధ్రప్రదేశ్ సహా 10 రాష్ట్రాలలో అసెంబ్లీలకు జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 28 సీట్లలో కాంగ్రెస్ 18 సీట్లు కోల్పోవడం! ఈ ఉప ఎన్నికల ఫలితాలు రాజ్యాంగం పరిధులు నిర్ణయించి హద్దులు అతిక్రమించకుండా ఏర్పాటు చేసిన పాలన, శాసన, న్యాయవ్యవస్థలకు కూడా గుణపాఠం కావాలి. వాటితోపాటు నిఘా, దర్యాప్తు సంస్థలూ ఈ ఫలితాల నుంచి నేర్చుకోవలసి ఉంటుంది. 

ఎందుకంటే, ప్రజాస్వామ్య విరుద్ధంగా, న్యాయవ్యవస్థను సైతం ధిక్క రించి పౌరుల జీవించే హక్కును హరిస్తూ దేశంలో ఎమర్జె న్సీని ఇందిరాగాంధీ విధించినప్పడు ఆమె మెరమెచ్చుల కోసం తప్పుడు సమాచారాన్ని ఆమెకు అందించడంలోనే గాదు, ఆ తరువాత ఎమర్జెన్సీ దురాగతాలను గణనలోకి తీసుకోకుండా 1977లో ఎన్నికలకు ‘ఇదే అదను... మీరు గెలుస్తారు’ అని తప్పుడు నివేదికలను గూఢచారి వ్యవస్థ, నిఘా సంస్థలూ అందించడాన్ని మరచిపోరాదు. దాని ఫలి తమే నాడు కాంగ్రెస్ ఘోర పరాజయం! 

అలాగే తాజా ఉప ఎన్నికలలో కూడా గూఢచార, దర్యాప్తు సంస్థలు కాంగ్రెస్‌కు అనుకూల నివేదికలిచ్చి, కాం గ్రెస్ కొంపను నిలువునా ముంచేశాయి! ఈ సత్యాన్ని కాం గ్రెస్ అధిష్టాన ప్రతినిధి, వాయలార్ రవి మాటల్లోనే విం దాం. ‘జగన్ అరెస్టే కాంగ్రెస్ కొంప ముంచేసింది’! ముం జేతి కంకణానికి ఇంక అద్దం దేనికి? అన్నట్టు ఆఖరికొక ముచ్చట - మౌనం అర్ధాంగీకారం అంటారు. 

ఈ భారీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ‘నారా’వారి ‘దేశం’ ఒక్క సీటు కూడా దక్కించు కోలేక ఘోర పరాజయం పొందిన తర్వాత ఇటీవల మనకు తెలీని కారణాంతరాల వల్ల హెచ్చుగా ‘మౌనం’ పాటించడానికి అలవాటుపడిన సీబీఐ మాజీ డెరైక్టర్, బాబు ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసిన మిత్రులు కె.విజయరామారావు నుంచి తాజా ఫలితాలపై స్పందన వినాలని అనిపిస్తోంది! నడుస్తున్న చరిత్రలో బహుశా ‘కారణాంతరాల వల్ల’ స్పందించకపోవచ్చు! పలువురి పరువు ప్రతిష్టల్ని తోడేసిన ఫలితాలివి!!

ఈ రోజున వైఎస్సార్ పార్టీ నాయకుడుగా జగన్ అవతరించిన తీరూ, జనంలోకి దూసుకువెడుతూ వచ్చిన వైనం మరొక చారిత్రక పరిణామాన్ని కూడా ధ్రువపరు స్తోంది. ఇంతకుముందు ఇందిరా గాంధీ హయాంలోనూ, అంతకుముందు ఆమె ప్రధాన మంత్రి కాకుండా లాల్ బహదూర్‌శాస్త్రి చాటున దాగి అడ్డంకులు సృష్టించిన ‘సిండికేట్’ ప్రముఖులంతా (నిజలింగప్ప, అతుల్యఘోష్, ఎస్‌కే పాటిల్, కామరాజ్, నీలం సంజీవరెడ్డి వగైరా) ఆ తర్వాత ఏదో ఒక సందర్భాన్ని అడ్డం పెట్టుకుని చడీచప్పు డూ లేకుండా తిరిగి అధికార ‘ఇందిరా’ కాంగ్రెస్ పంచన చేరిన వారేగాని, సజావుగా తమ వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న వారు కారు. 

కానీ వయసులో చిన్నవాడైనా జగన్ అధికారశక్తులు, వారి జీతనాతాలపై పనిచేస్తూ వారి ఆదేశాలపైన ధర్మా ధర్మ విచక్షణ లేకుండా సేవలందించే దర్యాప్తు సంస్థలు... న్యాయస్థానాల విమర్శలను, ఆదేశాలనూ కూడా ధిక్క రించి వేధింపులకు తనను గురిచేస్తున్నా వయసుకు మిం చిన ఆత్మ నిగ్రహంతో అన్నిరకాల ఒత్తిళ్లను ఎదురొడ్డి మొనగాడుగా నిలబడ్డాడు. ఆ వయసులో ఏ ముఖ్యమం త్రి కొడుకూ, లేదా ఏ మంత్రి బిడ్డలూ ఇంతటి ధైర్యసాహ సాలను ఇంత హుందాగా కనబరచిన సందర్భం ఈ క్షణం దాకా లేదు. 

కాంగ్రెస్ అధిష్టానానికి జైలు వెలుపలా, బయటా కూడా ఆ వయసులో ఇంతటి ఝలక్ ఇచ్చిన యువకుడూ లేడు. బహుశా అతనిలోని ఈ ప్రత్యేక లక్షణాలే అతనికి, అతని పార్టీకీ ప్రజాబాహుళ్యం నుంచి సర్వత్రా నీరాజ నాలు లభింపజేసి ఉంటాయి! వ్యక్తి పూజను కాదంటాం, వీరపూజను కాదనలేం. ఇంతకూ మన సామాజిక రుగ్మ తలకు, ఉత్పాతాలకు, తిరుగుబాట్లకు మూలాలన్నీ మనం ఎంచుకున్న దోపిడీ ఆర్థికవ్యవస్థ నుంచే పుట్టుకొస్తాయని గుర్తిస్తే చాలు! అప్పుడు వ్యవస్థలోని మన గబ్బు తెలుస్తుంది. మనసును ఆవరించిన మబ్బు తెర విడిపోతుంది!

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!