కోలా కృష్ణ మోహన్ చేసిన ఆరోపణలకు సంబంధించి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన నిజాయితీ నిరూపించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. సిబిఐ, ఇడి విచారణకు ఆయన సిద్దపడాలన్నారు. ఖాతాల నెంబర్లతో సహా బయట పెట్టిన చంద్రబాబు నాయుడు విదేశీ బ్యాంకు ఖాతాల గురించి కాంగ్రెస్ వారు ఎందుకు మాట్లాడటంలేదని ఆయన ప్రశ్నించారు. సింగపూర్ లో ఉన్న బ్యాంకు పేరు, ఖాతా నెంబరు కూడా కోలా ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ దోచుకొని విదేశీ బ్యాంకులలో దాచుకున్న విషయాన్ని ఈరోజు కోలా బయట పెట్టాడన్నారు. బాబు కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్న కోలా ఆయన వ్యవహారం, వారి అబ్బాయి బాగోతం బయటపెట్టారని తెలిపారు. కోలా ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు అవినీతిపై విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ ని విచారణకు రాకుండా నిలుపుదల చేసుకున్నారని తెలిపారు. అతని విదేశీ ఖాతాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు పోటీ పడి ఈరోజు ఉప ఎన్నికలలో పోటీపడి డబ్బు పంచుతున్నారని తెలిపారు. ఆ డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. టిడిపి వారు ఓటరుకు వెయ్యి రూపాయలు, కాంగ్రెస్ 500 రూపాయలు పంచుతున్నారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు డబ్బు పంచడంలేదని, ఆ విషయం ప్రజలు అడిగే పరిస్థితి తెచ్చారన్నారు.

No comments:
Post a Comment