ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈరోజు ఇక్కడ ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారిని ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు, విశ్వేశ్వర రెడ్డి, మధుసూదన రెడ్డి కలిశారు.
తిరుపతిలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వార్డుల్లో కాంగ్రెస్ నేతలు డబ్బు పంపిణీ చేస్తున్నా పట్టించుకోవడంలేదని తెలిపారు. తమ పార్టీ నేతలను బైండోవర్ పేరిట భారీగా అరెస్ట్లు చేస్తున్నారని చెప్పారు. మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే జోగి రమేష్ తిరుపతిలోనే తిష్టవేసినట్లు తెలిపారు.
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులు
కడప (వైఎస్ఆర్ జిల్లా): రాజంపేట నియోజకవర్గంలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇందుపల్లి, వీరబల్లి, నందలూరు మండలాల్లో తమ పార్టీ ఏజెంట్లను పోలీసులు బెదిరిస్తున్నారని తెలిపారు.

No comments:
Post a Comment