* జననేతను అవమానించి ఆనందించాలనుకున్న సర్కారు
* ‘జెడ్ కేటగిరీ’లో ఉన్న నాయకుడి భద్రత గాలికి వదిలేసిన వైనం
* ఎంపీగా, పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందువల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందంటూ జగన్‌ను అరెస్ట్ చేసి, రిమాండ్‌లో ఉంచిన కోర్టు
* అదే ఎంపీ హోదాను, పార్టీ అధ్యక్షుడిగా ప్రతిష్టను, ఖైదీగా ప్రత్యేక తరగతిని, జెడ్ *కేటగిరీ భద్రతను అన్నిటినీ తోసిరాజని.. రాజకీయ కక్ష సాధింపు
* చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ కోర్టుకు డొక్కు వ్యాన్‌లో తరలింపు
* భద్రత విషయం గురించి జగన్ అడిగినా.. ససేమిరా అన్న పోలీసులు
* సర్కారు దుశ్చర్యపై సీబీఐ కోర్టులో ఫిర్యాదు చేసిన జగన్‌మోహన్‌రెడ్డి
* నేను క్రిమినల్‌ను కాదు.. అవమానించటానికే వ్యాన్‌లో తీసుకొచ్చారు
* ఇది ప్రభుత్వం సాగిస్తున్న కక్ష సాధింపుల్లో భాగమని నాకు తెలుసు
* ఈ కోర్టు మీద ఉన్న గౌరవంతోనే వ్యాన్ ఎక్కటానికి నిరాకరించలేదు
* ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని దిగమింగి వ్యాన్‌లో ప్రయాణించాను
* కోర్టులో హాజరవటానికి నా వ్యక్తిగత భద్రతనూ ప్రమాదంలో పెట్టాను
* ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితులెవరినీ ఇలా వ్యాన్‌లో తేలేదు
* వ్యాన్‌లో ఎందుకు తెచ్చారో వివరణ ఇవ్వాలి.. లేదంటే ఆమరణ దీక్ష చేస్తా
* తన భార్యను కలవటానికీ అధికారులు నిరాకరిస్తున్నారని జగన్ ఫిర్యాదు
* వివరణ ఇవ్వాలంటూ సీబీఐ, జైలు అధికారులకు ప్రత్యేక కోర్టు ఆదేశాలు
* అప్పటికప్పుడు బులెట్‌ప్రూఫ్ వాహనం తెప్పించిన పోలీసులు
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఒక మనిషిపై కక్ష కట్టి అవమానించటానికి ఇంత నీచానికి దిగవచ్చని తెలుగు సినిమాల్లో థర్డ్ గ్రేడ్ విలన్‌కు కూడా తోచదేమో! రాజకీయంగా ఎదుర్కోలేని ప్రత్యర్థిని.. బలప్రయోగం ద్వారా అవమానించి వికృతానందం పొందాలనే చౌకబారు ఆలోచన చేసే వారిని ఏమనాలో!! అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఉప ఎన్నికల పోలింగ్‌కు 24 గంటల ముందు ఇలాంటి ఆలోచనే వచ్చింది. ఆ ఆలోచన ఫలితమే.. పార్లమెంటు సభ్యుడు, జెడ్ కేటగిరీ భద్రతలో ఉన్న నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని.. పోలీసులు సోమవారం ఏమాత్రం భద్రత లేని, సాధారణ ఖైదీలను తరలించటానికి ఉపయోగించే వ్యాన్‌లో కోర్టుకు తీసుకెళ్లారు.
జగన్‌ను రాజకీయంగా ఏమీ చేయలేకపోతున్నాం కనుక కనీసం ఇలా తీసుకెళ్లయినా.. దానికి సంబంధించిన దృశ్యాలు, ఫొటోల్ని తమకు అనుకూలంగా ఉండే చానళ్లలోను, ఉన్నట్టుండి మిత్రులుగా మారిపోయిన ఎల్లో పత్రికల్లోను వేసుకుని సంతృప్తి చెందాలనుకున్నారు. కాకుంటే.. ఈ ైవె ఖరిని నేరుగా న్యాయస్థానంలోనే జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. దీనికెవరు బాధ్యులంటూ పోలీసుల్ని న్యాయమూర్తి ప్రశ్నించటంతో.. వారు అప్పటికప్పుడు బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలోనే అత్యంత ప్రజాదరణ చూరగొన్న ఓ నాయకుడి విషయంలో, ఆయన భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజలను కలచివేసింది. అన్యాయంగా జైలులో పెట్టటమే కాకుండా.. రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రజా నాయకుడిని సాధారణ క్రిమినల్‌ను ఎక్కించినట్లు కనీస భద్రత లేని ఓ డొక్కు వ్యాన్ ఎక్కించిన పాలకుల హేయమైన చర్యపై ప్రజలు మండిపడుతున్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావటంలో కీలకపాత్ర పోషించిన దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనయుడి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. జగన్ తనకు జరిగిన అవమానాన్ని, తన భద్రతను గాలికొదిలేసిన తీరును జగన్ స్వయంగా కోర్టులో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
నేనేమీ క్రిమినల్‌ను కాదే..?
‘‘పార్లమెంట్ సభ్యుడ్ని, ఒక పార్టీ అధ్యక్షుడ్ని. ప్రభుత్వం నాకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. ఇదే కోర్టు నాకు జైలులో ఎ-కేటగిరీ కింద ప్రత్యేక సౌకర్యాలు కల్పించింది. ఇవేవీ పోలీసు అధికారులు పట్టించుకోకుండా ఈ రోజు నన్ను క్రిమినల్స్‌ను తెచ్చే సాధారణ వ్యాన్‌లో కోర్టుకు తెచ్చారు. నా అభ్యంతరాలను కోర్టు దృష్టికి తెస్తున్నా. నన్నెందుకు ఇలా తెచ్చారో బాధ్యులైన అధికారులు వివరణ ఇవ్వాలి. లేకపోతే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తా’’ అంటూ జగన్ తన ఆవేదనను న్యాయమూర్తి ఎ.పుల్లయ్య దృష్టికి తెచ్చారు. జగన్‌ను సోమవారం చంచల్‌గూడ జైలు నుంచి.. సాధారణ నేరస్థులను తరలించే నీలి రంగు పోలీసు వ్యాన్‌లో నాంపల్లి కోర్టుకు తరలించారు. దీనిపై జగన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
‘‘ఎంపీగా, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా సాక్షులను ప్రభావితం చేస్తానని సీబీఐ నన్ను అరెస్టు చేసింది. పది నెలలుగా నేను ఎంపీగానే ఉన్నా. భవిష్యత్తులోనూ ఎంపీగానే ఉంటా. నేను చేసిన తప్పేంటి? ఎంపీగా ఉండటమే నేను చేసిన తప్పా? ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండటమే నేరమా? నేనేమీ క్రిమినల్‌ను కాదు. దురుద్దేశంతో, కక్షపూరితంగా నన్ను క్రిమినల్ తరహాలో అందరికీ చూపించాలనే కుట్ర చేశారు. నన్ను అవమానించాలనే ఉద్దేశంతోనే క్రిమినల్స్‌ను తెచ్చే పోలీసు వ్యాన్‌లో తెచ్చారు’’ అని జగన్ పేర్కొన్నారు. తన అభ్యంతరాన్ని రికార్డు చేయాలని న్యాయమూర్తిని కోరారు.
నా భార్యను కలవకుండా అడ్డుకుంటున్నారు...
జైలులో కూడా తాను తన భార్యను కలవకుండా అడ్డుకుంటున్నారని జగన్ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో జైలు నిబంధనలు ఏం చెప్తున్నాయని న్యాయమూర్తి ప్రశ్నించగా.. జైలు అధికారులకు విచక్షణాధికారం ఉంటుందని, అయినా వారు తన భార్యను కలవనివ్వటం లేదని తెలిపారు. జగన్‌ను మానసికంగా వేధించాలనే కుట్రలో భాగంగానే దురుద్దేశంతో ఆయన్ను పోలీసు వ్యాన్‌లో తెచ్చారని జగన్ తరఫున హైకోర్టు న్యాయవాది నిరంజన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని సైతం ప్రత్యేక వాహనంలో కోర్టుకు తీసుకువచ్చేవారని వివరించారు.
‘‘మీకున్న అభ్యంతరాలను రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించండి. సీబీఐ అధికారులను ప్రతివాదులుగా చేర్చండి. మీకున్న అభ్యంతరాలపై సీబీఐ, జైలు అధికారుల వివరణ కోరతా’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అనంతరం జగన్ తరఫు న్యాయవాదులు మెమో రూపంలో జగన్ అభ్యంతరాలను కోర్టుకు సమర్పించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి.. 18లోగా వివరణ ఇవ్వాలని సీబీఐని, జైలు అధికారులను ఆదేశించారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తదా?: జడ్జి
ఈ దశలో జడ్జి జోక్యం చేసుకుని.. ‘‘వై.ఎస్.జగన్ పార్లమెంట్ సభ్యుడు. ఒక పార్టీకి అధ్యక్షుడు. ఆయన ప్రస్తుతం ఒక హోదాలో ఉన్నారు. ఆయన్ను అవమానించటం అనే అంశాన్ని పక్కనపెడితే.. సాధారణ వ్యాన్‌లో ఆయన్ను కోర్టుకు తెస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇందుకు ఎవరు బాధ్యులు?’’ అని నాంపల్లి పోలీసు ఇన్‌స్పెక్టర్ శ్రీధర్‌ను న్యాయమూర్తి పుల్లయ్య ప్రశ్నించారు. జగన్ సొంత వాహనంలో వెళ్లేందుకు కానీ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసేందుకు కానీ తక్షణం తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో వెంటనే డీసీపీ తరుణ్ జోషి, ఇతర అధికారులు కోర్టుకు చేరుకున్నారు. ఆ వెంటనే బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని తెప్పించారు. 11.30 గంటల ప్రాంతంలో బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని ఏర్పాటు చేశామని సీఐ శ్రీధర్ న్యాయమూర్తికి నివేదించారు. అనంతరం జగన్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు.
డొక్కు వ్యాన్‌ను చూసి జగన్ విస్మయం
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరయ్యేందుకు చంచల్‌గూడ జైలు దగ్గరకు తెచ్చిన డొక్కు వ్యాన్‌ను చూసి జగన్‌మోహన్‌రెడ్డి విస్మయానికి గురయ్యారు. ‘ఇదేమిటి ఈ వ్యాన్?’ అని పోలీసు అధికారులను అడిగారు. ఆ వాహనంలోనే కోర్టుకు వెళ్లానని జైలు అధికారులు చెప్పటంతో.. సాధారణంగా వినియోగించే బులెట్‌ప్రూఫ్ వాహనం ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన జైలు అధికారులను వాకబు చేశారు. జడ్ కేటగిరీ భద్రతలో ఉన్న తను.. భద్రత కారణాల రీత్యా బులెట్‌ప్రూఫ్ వాహనం వినియోగించాల్సి ఉండగా.. ఎలాంటి భద్రత లేకుండా సాధారణ వ్యాన్‌లో వెళ్లటమెలా అని జైలు అధికారులను ప్రశ్నించారు.
బులెట్‌ప్రూఫ్ వాహనం లేదని, వ్యాన్‌లోనే వెళ్లాలని జైలు అధికారులు స్పష్టం చేయటంతో జగన్ మౌనంగా అదే వ్యాన్‌లో ఎక్కి కూర్చున్నారు. చంచల్‌గూడ నుంచి నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం వరకు.. ఏ మాత్రం భద్రతలేని ఆ వ్యాన్‌లోనే ఆయనను తీసుకువచ్చారు. ట్రాఫిక్ సమస్య ఎదురైనప్పుడు అక్కడడక్కడా కొద్దిసేపు వాహనం నిలిచిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జగన్ భద్రత పరిస్థితి ఏమటని.. సాధారణ ప్రజలు సైతం విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
కోర్టుకు చెప్పేది వేరు.. చేసేది వేరు
జగన్‌మోహన్‌రెడ్డికి పటిష్ట భద్రత కల్పించేలా జైలు, పోలీసుశాఖలను ఆదేశించాలని ఆయన సతీమణి వై.ఎస్.భారతి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జగన్‌కు భద్రత విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. అయితే.. రిమాండ్ ఖైదీగా ఉన్న జగన్‌కు పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ (తెలంగాణ ప్రాంతం) హైకోర్టుకు నివేదించారు. ఆచరణలో మాత్రం జైళ్ల శాఖ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జగన్‌ను పటిష్ట భద్రత నడుమ బులెట్‌ప్రూఫ్ వాహనంలో కోర్టుకు తరలించాల్సి ఉన్నప్పటికీ సాధారణ వ్యాన్‌లో తీసుకు వెళ్లారు. జెడ్ కేటగిరీ భద్రత కలిగిన ఆయనను సాధారణ వ్యాన్‌లో కోర్టుకు తీసుకు వెళ్లటం నిబంధనలకు విరుద్ధమని జైళ్ల శాఖలో సుదీర్ఘ అనుభవం కలిగిన మాజీ అధికారులు స్పష్టంచేస్తున్నారు.

No comments:
Post a Comment