YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 6 June 2012

ఉప ముఖ్యమంత్రి పదవి కోసం మామ కు నీ భర్త వెంకటేశ్వరరావు వెన్నుపోటు పొడవడం రాజకీయ అబ్ది కోసం కాదా?

విశాఖపట్నం: కాంగ్రెస్ నేతలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ప్రశ్నల వర్షం కురిపించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గం పెంటకోటలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ప్రశ్నలు సంధించడంతోపాటు ముఖ్యమంత్రి భూ కబ్జాని బయటపెట్టారు. 

1. ఉప ముఖ్యమంత్రి పదవి కోసం మామ ఎన్ టిఆర్ కు నీ భర్త వెంకటేశ్వరరావు వెన్నుపోటు పొడవడం రాజకీయ అబ్ది కోసం కాదా? అని పురంధేశ్వరిని ప్రశ్నించారు. 
2. ఈ ఎన్నికలను రిఫరెండంగా ఎందుకు తీసుకోరు?
3. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అన్ని కాంగ్రెస్ వే అయితే ఇతర రాష్ట్రాలలో ఎందుకు ప్రవేశపెట్టలేదు?
4. ముస్లింలు దేశమంతటా ఉన్నారు. ముస్లిం రిజర్వేషన్ ని దేశమంతటా ఎందుకు అమలు చేయలేకపోయారు?
5. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీకి అమ్ముకున్న చిరంజీవి నీతి గురించి మాట్లాడటమా?
6. చిరంజీవి కుమార్తె ఇంట్లో మంచం కింద దొరికిన నగదు గురించి మాట్లాడరేం?
కాంగ్రెస్ పాలనలో ముందుంది ముంచే కాలం అన్నారు. 

బెంగళూరు విమానాశ్రయం వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయిదు ఎకరాలు కబ్జా చేశారని తెలిపారు. కర్ణాటకలోనే అయిదు ఎకరాలు ఆక్రమిస్తే ఇక్కడ ఎన్ని ఎకరాలు ఆక్రమించి ఉంటారో అర్ధం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి బాగోతం త్వరలోనే బయట పెడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే దొంగలైనా, దోపిడిదారులైనా, అవినీతిపరులైనా అధిష్టానవర్గం వారికి అండగా ఉంటుందని చెప్పారు. 
పదవీ కాంక్షతో పురంధేశ్వరి మాట్లాడుతున్నారన్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ మెప్పు కోసం ఆజాద్ మాట మార్చారని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!