ఉప ఎన్నికల దృష్ట్యా మీడియాతో మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలకు తన వాణి వినిపించే అవకాశం ఇవ్వమని కోర్టుని కోరారు. రాజ్యాంగ అధికరణ 19(1) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అండర్ ట్రయల్ గా ఉన్నా మీడియాతో మాట్లాడేందుకు అనుమతించాలని కోరుతూ, జైళ్లశాఖ డీజీ, ఐజీ, డీఐజీ లను రిట్ లో ప్రతివాదులుగా చేర్చారు.
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment