వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డికి 14 ఏళ్ల జైలు అంటూ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పడం చట్టవిరుద్ధం అని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. సిఎం వ్యాఖ్యలపై ఇప్పటికే ఫిర్యాదు అందిందని ఆయన చెప్పారు. నివేదిక తెప్పించుకుంటున్నామని, అందగానే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల వాతావరణం చెడిపోయేలా ఏ నాయకుడు మాట్లాడటం తగదని ఆయన చెప్పారు. జగన్ పై కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. జగన్ దోషా, కాదా అన్నది తేల్చాల్సింది కోర్టులేనన్నారు.
ఇప్పటి వరకు అన్ని పార్టీల నుంచి 275 ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి అందినట్లు ఆయన తెలిపారు. 117 ఫిర్యాదుల్లో బాధ్యులపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. 149 ఫిర్యాదులకు జిల్లాల నుంచి వివరణ రావాల్సి ఉందన్నారు. 9 ఫిర్యాదులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాల్సి ఉందన్నారు. వైఎస్ఆర్ సీపీ చేసిన 98 ఫిర్యాదుల్లో 48 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. టీడీపీ 45 ఫిర్యాదులివ్వగా, 25 పరిష్కరించామన్నారు. కాంగ్రెస్ 13 ఫిర్యాదులివ్వగా 8 పరిష్కరించామని చెప్పారు.
ఉపఎన్నికల్లో మొత్తం 5,413 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పెయిడ్ న్యూస్ పై జిల్లాల స్థాయిలోనే చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే జిల్లా స్థాయిలో కమిటీలు పరిష్కరిస్తాయన్నారు.

No comments:
Post a Comment