వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను కోర్టులో చూసిన ఆయన మేనత్త కమలమ్మ, పెద్దమ్మ వైఎస్ భారతమ్మ, అత్త సుగుణమ్మ, ఇతర బంధువులు, వైఎస్‌ఆర్‌సీపీ మహిళా నేతలు కన్నీటి పర్యంతమయ్యారు. జగన్‌ను కోర్టులో హాజరుపర్చనున్న నేపథ్యంలో సోమవారం ఉదయం వైఎస్.విజయమ్మ, జగన్ సతీమణి భారతిలతోపాటు వీరు కోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు ఎంత కష్టం వచ్చిందంటా వీరు దుఃఖించారు. జగన్‌ను టార్గెట్ చేసి మానసిక వేదనకు గురిచేస్తున్న తీరు తమను బాధకు గురిచేస్తోందని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. కోర్టు ఆవరణలో ఉన్నంతసేపూ కన్నీరు పెడుతూనే ఉన్నారు. వీరిని చూసిన మహిళా ఉద్యోగులు, మహిళా న్యాయవాదులు కూడా కంటతడి పెట్టడం కనిపించింది. కోర్టు అనుమతితో జగన్‌ను కలిసిన వారిలో జగన్ మామ డాక్టర్ ఈసీ.గంగిరెడ్డి, చిన్నాన్న వైఎస్.వివేకానందరెడ్డి, సోదరుడు వైఎస్.అనిల్‌రెడ్డి, బావమరిది ఈసీ.దినేష్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నగర కమిటీ నేత దేవిరెడ్డి విజితారెడ్డి తదితరులు ఉన్నారు.
భావోద్వేగానికి లోనైన విజయమ్మ
12 రోజుల ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న విజయమ్మ...కోడలు భారతి, ఇతర బంధువులతో కలిసి జగన్‌ను చూడాలని సోమవారం ఉదయం 9.30 గంటలకే కోర్టుకు చేరుకున్నారు. కోర్టు అనుమతితో 11 గంటల ప్రాంతంలో జగన్‌ను కలిశారు. కుమారుడిని చూడగానే విజయమ్మ భావోద్వేగానికి లోనయ్యారు. బాధను అణచుకొని జగన్‌తో కొద్దిసేపు మాట్లాడారు. 12 గంటల ప్రాంతంలో చెమర్చిన కళ్లతో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, మీడియా ప్రతినిధులకు నమస్కరిస్తూ వెళ్లిపోయారు. సాధారణ వ్యాన్‌లో జగన్‌ను తీసుకురావడం బాధారకమంటూ మీడియాతో అన్నారు.

No comments:
Post a Comment