YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 10 June 2012

'కోలా ఆరోపణలపై బాబు నోరు విప్పాలి'

అన్నాహజారే వారసుడని చెప్పుకోవటం కాదని... చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. కోలా చేసిన ఆరోపణలపై బాబు నోరు విప్పాలన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీకి ఓటర్లే తగిన బుద్ధి చెబుతారని బాలరాజు అన్నారు.


మంత్రి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి: కాపు


రాయదుర్గం : రెవిన్యూ మంత్రి రఘువీరా రెడ్డి ఆగడాలకు అడ్డుకట్టవేయాలని వైఎస్‌ఆర్‌సిపి ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. పోలింగ్‌బూత్‌ల వద్ద అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, ఎన్నికల సంఘం అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాయదుర్గం వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి కాపు రామచంద్రారెడ్డి కోరారు. 

ఓటమి భయంతోనే అధికారపార్టీ నేతలు పోలీసులతో దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇళ్లల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టుకువచ్చి వేధిస్తున్నారని, మహిళల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించడం దారుణమన్నారు.


ఏసీబీ నోటీసులు అవాస్తవం: కృష్ణదాస్


తనకు ఏసీబీ నోటీసులు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ఖండించారు. అసత్య వార్తలను రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై చర్యలు తీసుకోవాలని ఆయన ఆదివారం ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ కు ఈ మెయిల్ చేశారు. ఏసీబీ తనకు ఎలాంటి నోటీసులు జారీ చేయలేదని కృష్ణదాస్ తెలిపారు.


బాబు విచారణకు అంగీకరించాలి: అంబటి


తిరుపతి : కోలా కృష్ణమోహన్ ఆరోపణలపై చంద్రబాబు విచారణకు అంగీకరిస్తే బాబు అవినీతి బయటకు వస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. కోలా చెప్పిన అకౌంట్లు తనవి కావాని చంద్రబాబు అంగీకరించగలడా అని ఆయన ఆదివారమిక్కడ విలేకర్ల సమావేశంలో సూటిగా ప్రశ్నించారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!