YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 17 June 2012

సారొచ్చి కొంపముంచారు (Chiru Got Shock From Tirupati People)

తిరుపతిలో కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ కంటే కూడా చిరంజీవికి ఘోర పరాభవం అంటే బాగుంటుందేమో.!. తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి ప్రజలను పట్టించుకోకపోవడం వల్లనే దారుణమైన ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ నేతలు   అంటున్నారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడితే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ కాంగ్రెస్‌ క్యాడర్‌ చిరంజీవిపై మండిపడుతోంది.

తిరుపతి ప్రజలు చిరంజీవికి కర్రు కాల్చివాత పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓటుతో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజాసమస్యలు పట్టించుకోకుండా.. కోట్లకుకోట్ల రూపాయలు  డబ్బులు పంచినా ప్రజలు ఓట్లేయరని అంటున్నారు. ఇది కచ్చితంగా చిరంజీవి ఓటమేనని  కాంగ్రెస్‌ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలను పట్టించుకోకుండా.. పదవుల కోసం పరుగులు పెడితే ఫలితాలు ఇలాగే ఉంటాయని గాంధీభవన్‌లో ఒక  కాంగ్రెస్‌ నాయకుడు వ్యాఖ్యానించారు.

తిరుపతిలో 54 శాతం పోలింగ్ మాత్రమే నమోదైన ఓటర్లు కసితీర ఓట్లు వేశారని తిరుపతి నేతలు అంటున్నారు.2009లో చిరంజీవి 9 వేల మెజార్టీతో గెలిస్తే.. ఇప్పుడు కరుణాకర్‌ రెడ్డి17 వేల 975 ఓట్లతో విజయఢంకా మోగించారు. అంతేకాదు...2009లో భూమన కరుణాకర్‌ రెడ్డికి 40 వేల 379 ఓట్లు వస్తే..ఇప్పుడు 59 వేల 195 ఓట్లు వచ్చాయి . ఈ అంకెలే చిరంజీవిపై ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. పోలింగ్ శాతం ఇంకా పెరిగి ఉంటే.. తిరుపతిలో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం ఎదురై ఉండేదని విశ్లేషకులు చెప్తున్నారు.

నామినేషన్ల ఘట్టం నాటి నుంచి చిరంజీవి ఆరు సార్లు తిరుపతిలో పర్యటించారు. గులాం నబీ అజాద్‌, సీఎం కిరణ్, పిసిసి చీఫ్ బొత్స కూడా తిరుపతిలో సుడిగాలి పర్యటన చేశారు. అయితే...చిరంజీవి ఎన్ని సార్లు వచ్చిన ప్రజలు ఆయనను నమ్మలేదు. సీఎం హామీలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. కాంగ్రెస్‌ అభ్యర్ధి వెంకట రమణ అయితే..చిరంజీవి పర్యటనలను విజయవంతం  చేయడానికి నానాతంటాలు పడాల్సి వచ్చింది. మూడేళ్లు ఎమ్మెల్యేగా  ఉన్న చిరంజీవి ఏనాడు తమను పట్టించుకోలేదు.. ఆయనకు ఎందుకు ఓట్లు వేయాలని ప్రశ్నిస్తున్నారు తిరుపతి మహిళలు.
తిరుపతి ప్రజలే కాదు.. కార్యకర్తలు కూడా కారాలు..మిరియాలు నూరుతున్నారు. చిరంజీవిని ప్రచారానికి పిలవకుండా ఉన్నా ఎక్కువ ఓట్లు వచ్చేవని చెప్తున్నారు. సారొచ్చి కొంపముంచారంటూ చిరంజీవిపై మండిపడుతున్నారు.



No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!