- కేంద్రం మార్చిలోనే ఇచ్చినా.. కదలని రాష్ట్ర సర్కారు
- త్వరగా మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్
హైదరాబాద్, న్యూస్‌లైన్: రోజురోజుకూ నిత్యావసరాల ధరలు ఆకాశానికి తాకుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు కరువు భత్యం మంజూరు చేయడం లేదు. సర్కారు తీరుపై పది లక్షల మంది ఉద్యోగులు, ఐదు లక్షల మంది పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివంగత నేత వైఎస్సార్ మృతి తర్వాత ప్రతిసారీ కరువు భత్యం మంజూరులో కాంగ్రెస్ ప్రభుత్వం జాప్యం చేస్తూ వస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. జనవరి నుంచి జూన్ వరకు 5.992 శాతం కరువు భత్యం రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మంజూరు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఏడు శాతం కరువు భత్యాన్ని ఈ ఏడాది మార్చి 23నే మంజూరు చేసింది.
సాధారణంగా కేంద్ర ఉద్యోగులకు కరువు భత్యం మంజూరు చేసిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు కరువు భత్యం మంజూరు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కేంద్ర ఉద్యోగులకు మార్చిలోనే మంజూరు అయినా.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వడం లేదు. ఉద్యోగ సంఘాలు కూడా పలుమార్లు సీఎంను, సీఎస్‌ను కలిసి వెంటనే కరువు భత్యం మంజూరు చేయాలని వినతి పత్రాలు సమర్పించినా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఉప ఎన్నికలు ముగిసినందున ఇకనైనా మంజూరు చేయాలని, ఇందుకు వెంటనే కేబినెట్ సమావేశం కావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కరువు భత్యం మంజూరుకు సంబంధించిన ఫైలును కేబినెట్ సమావేశంలో పెట్టేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే ఆమోదం తెలిపారు. ఈ ఏడాది మార్చి 19న కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు జరగలేదు. గత ఏడాది రెండు కరువు భత్యాలు మంజూరులో కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని, ఇది ఉద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణిగా పరిగణించాల్సి వస్తుందని ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
గతంలో చంద్రబాబు హయాంలో కరవు భత్యం కోసం పోరాటం చేయాల్సి వచ్చేదని, అయితే వైఎస్ సీఎం అయ్యాక ఆ పరిస్థితి మారిందని వారు గుర్తుచేస్తున్నారు. వైఎస్ సకాలంలో ఉద్యోగులకు కరువు భత్యం మంజూరు చేయడమే కాకుండా... చంద్రబాబు పెన్షనర్లకు నిలిపేసిన కరువు భత్యాన్ని పునరుద్ధరించారని ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు హయాం నాటి పరిస్థితులు నెలకొంటున్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం పెంపు మేరకు తాజా పీఆర్సీలో పేర్కొన్న నిర్ధారిత సూత్రం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులకు డీఏ పెంచడం ఆనవాయితీ. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 35.952 శాతం డీఏ ఇస్తున్నారు. తాజా పెంపును ప్రభుత్వం ఆమోదిస్తే.. ఉద్యోగుల డీఏ 41.944 శాతానికి పెరగనుంది. ఈ మేరకు పెన్షనర్లకు కూడా కరువు భృతి పెరుగుతుంది.

No comments:
Post a Comment