ఉప ఎన్నికల విజయంపై డి.ఎ. సోమయాజులు ఉద్ఘాటన
సానుభూతి, పాలపొంగు కానే కాదు..
వైఎస్సార్ కాంగ్రెస్ బలీయమైన శక్తిగా ఎదుగుతోంది
‘నీల్సన్’, ‘ది హిందూ’ సర్వేలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్‌కే అధిక శాతం ఓట్లని తేల్చి చెప్పాయి
ఆ సర్వేలతో పోల్చినా.. ఏడాదిలో పది శాతం ఓట్లు పెంచుకున్నాం
లగడపాటి వ్యాఖ్యలు అర్థరహితం
టీడీపీపై ప్రజలకు ఆగ్రహమెందుకో వారే తెలుసుకోవాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక బలీయమైన శక్తిగా ఎదుగుతోందన్న విషయం ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డి.ఎ. సోమయాజులు అన్నారు. ఒక లోక్‌సభ, 15 ఎమ్మెల్యే స్థానాలు గెల్చుకోవడం ఏ మాత్రం పాలపొంగు కానేకాదని అన్నారు. ఏడాది కాలంగా వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటూ రైతుల, చేనేత కార్మికుల, విద్యార్థులతోపాటు అన్ని వర్గాల సమస్యలపై పోరాటాలు చేస్తూ వస్తున్నారని, దాని ఫలితంగానే ప్రజల మద్దతు తమకు పెరిగిందని ఆయన అన్నారు. ఇదేదో కొత్తగా వచ్చిన ఊపు ఎంత మాత్రం కాదని సోమయాజులు తేల్చి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కటి మాత్రమే ప్రజల పక్షాన నిలబడి పోరాడే పార్టీగా రాష్ట్ర ప్రజలు గుర్తించారని ఆయన స్పష్టం చేశారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ, కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు, పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ గెలుపు పాలపొంగు లాంటిదేనని, సానుభూతి ఎప్పుడూ పనిచేయదని విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను సోమయాజులు తీవ్రంగా తప్పుపట్టారు. జగన్ అరెస్టు, విజయమ్మ కన్నీరు లేకుంటే కాంగ్రెస్‌కు ఐదారు సీట్లు వచ్చి ఉండేవని చెప్పడం కూడా పూర్తిగా అర్థరహితమని అన్నారు. జగన్‌ను అరెస్టు చేయడానికి బాగా ముందే ఈ ఏడాది మే 1వ తేదీ ‘నీల్సన్’ సంస్థ చేసిన సర్వేలో అన్ని స్థానాలూ తమ పార్టీయే గెలుస్తుందని వెలువడిందనే విషయం గమనించాలని సోమయాజులు చెప్పారు. ఈ సంస్థ ద్వారా కాంగ్రెస్ సర్వే నిర్వహించుకుంటూ ఉంటుందని, ఈ నివేదిక వివరాలు తన వద్దే కాదు, రాష్ర్ట ప్రభుత్వం వద్ద కూడా ఉన్నాయని ఆయన అన్నారు. వాస్తవానికి అప్పట్లో నీల్సన్ చేసిన సర్వేలో రామచంద్రపురం, నర్సాపురం స్థానాల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందనే పేర్కొన్నారని, అయితే అనూహ్యమైన రీతిలో అక్కడ టీడీపీ తనను తాను బలి చేసుకుని కాంగ్రెస్‌కు ఓట్లు వేయిస్తుందని భావించలేకపోయారని ఆయన చెప్పారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ, సుమారు 17 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన టీడీపీ ఇంత దారుణంగా తమ ఉనికిని కోల్పోవడం వింతగా ఉందన్నారు.
‘దిహిందూ’ గతేడాదే చెప్పింది..
వైఎస్సార్ కాంగ్రెస్ సానుభూతి, కన్నీళ్లపై ఆధారపడిన పార్టీ ఎంత మాత్రం కాదని, వాటన్నింటినీ ఎపుడో అధిగమించి ముందుకు సాగుతోందని సోమయాజులు అన్నారు. ‘గత ఏడాది ఆగస్టు 13న ది హిందూ పత్రిక సీఎన్ఎన్-ఐబీఎన్, సీఎన్ఎన్బీ, సీఎస్డీఎస్ సహకారంతో నిర్వహించిన సర్వేలోనే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్‌కు 36 శాతం, కాంగ్రెస్-పీఆర్పీకి కలిపి 32 శాతం, టీడీపీకి 24 శాతం ఓట్లు ఉన్నాయని పేర్కొంది. అన్ని పార్టీల కంటే జగన్ చాలా ముందుగా ఉన్నారని ఆ పత్రికలో రాశారు. అంతే కాదు, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పీఆర్పీకి కలిపి 58 శాతం(39 ప్లస్19)గా ఉన్న ఓటర్ల మద్దతు 32 శాతానికి దిగజారిందనే విషయం కూడా ‘హిందూ’ రాసింది. అదే రోజు ఇండియాటుడే పత్రిక మరికొన్ని సంస్థలతో కలిసి చేయించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు 38 శాతం ఓటర్ల మద్దతు ఉందని పేర్కొంది. తాజాగా ఉప ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో జగన్‌కు 49 శాతం మద్దతు ఉన్నట్లు వెల్లడైంది. అంటే ఏడాది కాలంలో తమ పార్టీ 10% శాతం ఓట్లను పెంచుకుందని స్పష్టం అవుతోంది. వాస్తవాలిలా ఉంటే సానుభూతి, కన్నీరు, పాలపొంగు అని చెప్పడం అర్థరహితం’ అని ఉద్ఘాటించారు.
టీడీపీ విశ్లేషణ వింతగా ఉంది..
ఉప ఎన్నికల్లో అధికారపక్షానికి సహకరించి మానవబాంబు, సైకిల్ బాంబులాగా టీడీపీ తనను తాను బలి చేసుకుందని సోమయాజులు వ్యంగ్యంగా విమర్శించారు. అధికారపక్షంపై అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని, కానీ తనపై ప్రజలు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారో టీడీపీ విశ్లేషించుకోలేకపోతోందని ఆయన అన్నారు. పైగా ఉప ఎన్నికలు జరిగిన స్థానాలు తమవి కాదని టీడీపీ భాష్యం చెబుతోందని, దీనర్థం ఏమిటని ఆయన నిలదీశారు. ‘‘మీ స్థానాలు కాక పోతే ఎందుకు పోటీ చేసినట్లు? 294 శాసనసభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం మీకున్నవి 85 స్థానాలు.. అంటే సుమారు 210 స్థానాలు ఇపుడు మీవి కావు. మరి 2014 ఎన్నికల్లో కూడా ఆ స్థానాలు మావి కావని చెబుతూ ఎన్నికల్లో పాల్గొంటారా? అసలు ఈ మాటలతో ప్రజలకు మీరిస్తున్న సంకేతాలు ఏమిటి?’’ అని సోమయాజులు నిలదీశారు. ‘‘తొమ్మిది పదేళ్లు ప్రజలు టీడీపీకి అధికారం ఇస్తే వారు చేసిందేమిటి? ప్రజలకు పనికి వచ్చే పని ఒక్కటి చేశారా?’’ అని సోమయాజులు విమర్శించారు. ప్రధాని పదవి వద్దన్నానని, అసలు ప్రధానిని తానే నియమించాననీ చెప్పుకున్న చంద్రబాబు రాష్ట్ర రైతులకు ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు కనీసం కేంద్రాన్నయినా సాయం కోరి ఉంటే.. రైతులకు ఆకలి చావులు తప్పేవన్నారు.
జగన్ అరెస్టు కక్ష సాధింపే..
జగన్‌ను అరెస్టు చేయడానికి ముందు దశల వారీగా ఢిల్లీలో వయలార్ రవి, ఆజాద్, కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ప్రధాని కార్యాలయ మంత్రి నారాయణస్వామి అందరూ సమావేశమై సోనియా అనుమతితోనే అరెస్టు చేశారని, ఈ విషయం తాను చెప్పడం లేదని, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఇండియాటుడే పత్రిక రాసిందని సోమయాజులు అన్నారు. ఈ పత్రిక కథనాన్ని ఇంత వరకూ ఎవరూ ఖండించక పోవడం, వయలార్ రవి స్వయంగా జగన్ అరెస్టే తమ కొంప ముంచిందని వ్యాఖ్యానించడం ఇందులో కక్ష సాధింపు ఉందని ధ్రువీకరిస్తోందన్నారు. సీబీఐని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి వాడుకుంటోందని, ఇప్పటికే రాజ్యసభ, లోక్‌సభల్లో జరిగిన చర్చల్లో అన్ని పక్షాలూ (కాంగ్రెస్ మినహా) తూర్పారబట్టాయని ఆయన అన్నారు.
రూ.14 లక్షల కోట్ల ఖనిజమా!!!
కొంత కాలంగా చేస్తున్న లక్ష కోట్ల ఆరోపణలను పక్కన బెట్టి తీరా ఉప ఎన్నికల సమయంలో 16 లక్షల కోట్ల అవినీతి అంటూ టీడీపీ నేత దాడి వీరభద్రరావు ఏ మాత్రం అర్థం లేని విధంగా మాట్లాడారని సోమయాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్వాపరాలు ఏ మాత్రం పట్టించుకోకుండా కొన్ని మీడియా, పత్రికలు కూడా టీడీపీ వారు చెప్పిన అబద్ధాలనే అమృత భాండాలుగా ప్రచారం చేశాయని విమర్శించారు. బయ్యారంలో 14 లక్షల కోట్ల విలువ చేసే ఇనుప ఖనిజం ఉందా? దేశంలోనే అత్యుత్తమమైన ఎన్ఎండీసీ సంస్థ తీసే ఇనుము విలువే 66,000 కోట్ల రూపాయలు లేదే? విమర్శలు, ఆరోపణలు చేస్తే ఒక అర్థం ఉండాలి అని సోమయాజులు అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు తమ ఓటమికి నిజమైన కారణాలను చూడకుండా ఎంత సేపూ జగన్‌పై పడి ఏడ్వడం విడ్డూరమని ఆయన అన్నారు.

No comments:
Post a Comment