YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 10 June 2012

12 రోజుల్లో విజయమ్మ, షర్మిల 5 వేల కిలోమీటర్ల ప్రయాణం

* ముగిసిన విజయమ్మ, షర్మిలల 12 రోజుల నిర్విరామ పర్యటన
* 18 అసెంబ్లీ, 1 ఎంపీ నియోజకవర్గాల్లో ప్రచారం..కార్యకర్తల్లో నూతనోత్సాహం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ తన కుమార్తె షర్మిలతో కలిసి నిర్విరామంగా కొనసాగించిన ఉప ఎన్నికల ప్రచారాన్ని ఆదివారం విజయవంతంగా ముగించారు. 2014 ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచార బాధ్యతలు స్వీకరించిన విజయమ్మ వరుసగా 12 రోజుల పాటు 18 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానాల పరిధిలో పర్యటించి ప్రచారం చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని.. సీబీఐ విచారణ పేరిట పిలిపించి మూడు రోజులు విచారించిన తర్వాత గత నెల 27న రాత్రి అకస్మాత్తుగా అరెస్టు చేసిన నేపథ్యంలో, ప్రచార బాధ్యతను విజయమ్మ స్వీకరించారు. షర్మిల ఆమెకు వెన్నంటి నిలిచారు. 

కుమారుడి అక్రమ అరెస్టుతో తీవ్ర ఆవేదనకు గురైనప్పటికీ.. కీలక సమయంలో ఏ మాత్రం కుంగిపోకుండా, పదవులను తృణప్రాయంగా త్యజించిన పార్టీ అభ్యర్థుల తరపున విజయమ్మ మే 30వ తేదీ నుంచే ప్రచారానికి ఉపక్రమించారు. ప్రచార బరిలోకి దిగి పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. మే 30వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట నుంచి ప్రారంభించి పాయకరావుపేట, పోలవరం, నర్సాపురం, రామచంద్రపురం, మాచర్ల, ప్రత్తిపాడు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, అనంతపురం, రాయదుర్గం, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, ఒంగోలు, ఉదయగిరి, తిరుపతి, పరకాల అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నెల్లూరు లోక్‌సభ స్థానంలో విసృ్తతంగా పర్యటించారు. 

జగన్‌ను నిర్బంధిస్తే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల స్థైర్యాన్ని దెబ్బ తీయగలమని కాంగ్రెస్, టీడీపీలు వేసిన ఎత్తుగడ విఫలమైంది. విజయమ్మ సభలు అనూహ్యమైన రీతిలో విజయవంతం కావడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. తాను దుఃఖంలో ఉన్నా.. పార్టీ నేతలు, కార్యకర్తల్లో మాత్రం ఆమె ఉత్సాహాన్ని రేకెత్తించారని, పార్టీకి తిరుగులేని మద్దతు కూడగట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తం 5 వేల కి.మీ. ప్రయాణం
ఈ 12 రోజుల్లో విజయమ్మ, షర్మిల 5 వేల కిలోమీటర్ల మేర రోడ్డు ప్రయాణం చేసి ప్రచారాన్ని నిర్వహించారు. 18 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటుగా నెల్లూరు లోక్‌సభ స్థానం పరిధిలోని మరో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో సుడిగాలి పర్యటనను నిర్వహించి మొత్తం 29 పెద్ద బహిరంగ సభల్లో పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఎవరికీ లేనంతటి ప్రజాదరణను విజయమ్మ చూరగొన్నారనీ జగన్‌ను అరెస్టు చేయడాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున సభలకు హాజరై ఆయనను నిర్బంధించడాన్ని తామెంతగా వ్యతిరేకిస్తున్నదీ చాటారని పార్టీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు. సభలకు హాజరైన ప్రజలకు, సహకరించిన పార్టీ నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలింగ్ రోజైన ఈ నెల 12న ప్రజలు వైఎస్ కుటుంబంపై తమకు గల అభిమానాన్ని చాటుకోవాలని రఘురామ్ విజ్ఞప్తి చేశారు

1 comment:

  1. If they think on the lines like "his arrest can fetch votes" it is BRUTAL totally against democratic principles. Where is the country going? What about its credibility. Are there no solutions to this kind of authoritarianism? What is the constitutional support for the post of Chairperson of UPA Government? Or all these things are being carried by the PM? How can high court honors the petition without signature? Don't we have intellectuals to think about all these odds going on in this country. Are we ready to allow the BRUTALITY to continue?

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!