ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు అధికార పార్టీ నేతలు ఎంతటికైనా బరితెగించడానికి వెనకాడటం లేదు. ముఖ్యంగా తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతూ యధేచ్ఛగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.
తిరుపతి శివార్లలోని తిరుచానూర్ సర్కిల్ లో స్టార్ హోటల్ లో తిష్ట వేసిన మంత్రి పార్థసారధి అక్కడి నుంచి ఎన్నికల మంత్రాంగం నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం నిన్న సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడింది. అప్పటి నుంచి ఎన్నికల పోలింగ్ ముగిసే వరకూ ఇతర ప్రాంత ప్రజా ప్రతినిధులు, నేతలూ ఎవ్వరూ ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో వుండకూడదు. అయితే మంత్రి పార్థసారధికి మాత్రం ఎన్నికల నిబంధనలు వర్తించడంలేదు. మంత్రితోపాటు కృష్ణాజిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగిరమేష్ తిరుపతి శివార్లలో తిష్ట వేసి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.

No comments:
Post a Comment