రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి కూడా హాజరు
హైదరాబాద్, న్యూస్‌లైన్: కడప పార్లమెంట్ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని దర్యాప్తు అధికారులు మూడవ రోజు కోఠి కేంద్రీయ సదన్ సీబీఐ కార్యాలయంలోనే విచారించారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా న్యాయవాదుల సమక్షంలోనే విచారణ కొనసాగింది. ఉదయం 10.30 గంటలకు చంచల్‌గూడ జైలు నుంచి జగన్‌ను బయటకు తీసుకొచ్చారు. ఆయన నవ్వుతూ అభివాదం చేసి అక్కడే సిద్ధంగా ఉన్న నల్ల స్కార్పియో బులెట్ ప్రూఫ్ వాహనంలో కూర్చున్నారు. కోఠిలోని కేంద్రీయ సదన్‌కు చేరుకున్న అనంతరం సీబీఐ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డీఐజీ వెంకటేష్, డీఎస్పీ ప్రవీణ్‌లు ఆయనను విచారించారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ మధ్యాహ్నం వరకు సీబీఐ కోర్టులో ఉన్నారు. అనంతరం ఆయన సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు జగన్ విచారణ కొనసాగింది. తిరిగి పూర్తి భద్రత మధ్య చంచల్‌గూడ జైలుకు తరలించారు.
విచారణకు హాజరైన ద్వారంపూడి
విచారించింది అరగంటే...





No comments:
Post a Comment