YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 4 June 2012

మహానేత వైఎస్ కుటుంబానికి అండగా ఉంటాం

స్పీకర్‌కు రాజీనామా పత్రాలు ఇచ్చిన ఎమ్మెల్యేలు
మహానేత వైఎస్ కుటుంబానికి అండగా ఉంటాం
మూడేళ్లుగా సహనంతో ఉన్నాం... కానీ,
వైఎస్ కుటుంబంపై వేధింపులు పరాకాష్టకు చేరాయి
విజయమ్మ బాధను కూడా కాంగ్రెస్ నేతలు అపహాస్యం చేస్తున్నారు
జగన్‌కు అండగా ఉండాలని జనమంతా కోరుకుంటున్నారు.. 
వారి అభిమతం మేరకే రాజీనామా
జూన్ 15 తరువాత రాజకీయాల్లో మార్పులు తప్పవు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై వేధింపులు పరాకాష్టకు చేరాయి. ఆ కుటుంబాన్ని అణచివేసేందుకు చేపడుతున్న చర్యలను మేం భరించలేకపోతున్నాం. మహానేత మరణం తరువాత ఆ కుటుంబంపై జరుగుతున్న కుట్రలు, రాజకీయంగా అణచివేసే చర్యలను నిరసిస్తూ మా శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాం’’ అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని - ఏలూరు), ఆర్‌వీఎస్‌కే రంగారావు (బొబ్బిలి) ఆవేదన వ్యక్తంచేశారు. ఆళ్లనాని, రంగారావులు సోమవారం మధ్యాహ్నం శాసన సభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా పత్రాలను సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ముందుగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. ‘‘వైఎస్ వల్ల మేం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యాం. కష్టాల్లో ఉన్న ఆ మహానేత కుటుంబానికి అండగా ఉండటం మా నైతిక బాధ్యతగా భావిస్తున్నాం. మా నియోజకవర్గ ప్రజల అభిమతం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాం. రాజీనామా లేఖలను స్పీకర్‌కు అందజేశాం. ఆయన మమ్మల్ని ఏ ప్రశ్నలూ అడగలేదు. ఆయన మళ్లీ ఎప్పుడు పిలిచినా మా నిర్ణయాన్ని చెబుతాం’’ అని చెప్పారు. 

‘‘వైఎస్ కుటుంబాన్ని అణచివేసేందుకు జరుగుతున్న కుట్రలు రాష్ట్ర ప్రజలతోపాటు మాకూ బాధ కలిగిస్తున్నాయి. జగన్ ఓదార్పు యాత్రకు అడగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారు. కేసులతో ఆయన్ని వేధిస్తున్నారు. అయినప్పటికీ గత మూడేళ్లుగా మేం సహనంతో ఉంటూ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశాం. ఆ కుటుంబంపై వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడంలేదు. జగన్ అరెస్టుతో వేధింపులు పరాకాష్టకు చేరాయి. వైఎస్ మరణం, జగన్ అరెస్టుతో విజయమ్మ పడుతున్న బాధను కూడా అపహాస్యం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగే ఓపిక, సహనం మాకు లేవు. విజయమ్మ, జగన్ కలిసి వైఎస్‌ను చంపించారని కూడా కాంగ్రెస్ నేతలు చెబుతుంటే ఇంకా మౌనంగా ఉండటం మావల్ల కావడంలేదు. రాష్ట్ర ప్రజ లంతా జగన్‌కు అండగా ఉన్నారు. నా నియోజకవర్గ ప్రజలు సైతం జగన్‌కు అండగా ఉండాలని కోరారు. వారి అభిమతం మేరకే రాజీనామా నిర్ణయం తీసుకున్నా. జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాలకు పాల్పడలేదని మేం నమ్ముతున్నాం. ఆధారాలు చూపకుండానే జగన్‌కు కాంగ్రెస్ నేతలు జైలు శిక్షను కూడా ఖరారు చేసేస్తున్నారు. 

జగన్ అరె స్టు వెనుక వారి పాత్ర లేదంటే ఎలా నమ్ముతాం? జగన్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే కేంద్ర మంత్రి, సీఎం అయ్యేవారని ఆజాద్ అంటున్నారు. అంటే.. జగన్ పార్టీలో లేకుంటే జైలుపాలు చేస్తామని అన్నట్లే కదా!’’ అని అన్నారు. అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు ఎందుకు వేయలేదని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అప్పటికీ, ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు వైఎస్ కుటుంబాన్ని అణచివేసే చర్యలు కొనసాగుతున్నాయి. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి అండగా ఉండటం మా నైతిక బాధ్యతగా భావించాం’’ అని బదులిచ్చారు. మీరు ప్రలోభాలకు గురయ్యారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించగా.. ‘‘కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన మహానేత వైఎస్ కుటుంబంపైనే బురద చల్లేందుకు వారు వెనుకాడ టంలేదు. అఫ్ట్రాల్ ఎమ్మెల్యేలమైన మాపై ఆరోపణలు చేయరా? అయినా మా నిర్ణయం ఆమోదయోగ్యమో కాదో, వాళ్ల ఆరోపణల్లో నిజమెంతో ప్రజలే తీర్పు ఇస్తారు’’ అని పేర్కొన్నారు.

జగన్‌పై ముమ్మాటికీ కక్ష సాధింపే: రంగారావు
జగన్ అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపేనని రంగారావు చెప్పారు. ‘‘వైఎస్ మరణం తరువాత రాష్ట్రం ఎటువైపు వెళ్తోందో అందరం చూ స్తూనే ఉన్నాం. వైఎస్ కుటుంబంపట్ల ప్రజలంతా సానుకూలంగా ఉన్నా రు. విచారణ పేరుతో జగన్‌ను పిలిచి అరెస్టు చేయడాన్ని ప్రజలంతా కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నారు. ప్రజాభిప్రాయం మేరకే నేను రాజీ నామా చేశాను’’ అని అన్నారు. బొత్సతో విభేదాలు, కాంగ్రెస్‌లో పదవులు రావనే భావనతోనే జగన్‌వైపు వెళ్లారని కొందరు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించగా.. ‘‘ఒక వ్యక్తితో విభేదాలుంటే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరముండదు. 

ప్రజాభిప్రాయం మేరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నా. నాకు నిజంగా పదవులే ముఖ్యమని అనుకుంటే ఇక్కడే (కాంగ్రెస్‌లోనే) కొనసాగేవాడిని. అక్కడ జగన్ అరెస్టయ్యారు. ఇబ్బందుల్లో ఉన్నారు. అక్కడేం పదవులుంటాయో మీరే చెప్పండి’’ అని అన్నారు. ‘‘జగన్‌కు జరుగుతున్న అన్యాయంపై పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిలో చాలామంది జగన్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. జూన్ 15 తరువాత రాష్ట్ర రాజకీయాల్లో తప్పనిసరిగా మార్పులు వస్తాయి. ఉప ఎన్నికలవల్ల పాలనకు కొంత ఇబ్బం ది కలిగినా, కొంత ధనం ఖర్చయినప్పటికీ మేము మాత్రం ప్రజాభిప్రాయాన్ని గౌరవించే రాజీనామా నిర్ణయం తీసుకున్నాం’’ అని చెప్పారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!