YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday, 4 June 2012

వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి

శ్రీకాంత్‌రెడ్డి గన్‌మేన్ గాలిలోకి కాల్పులు
రాయచోటిలో ఉద్రిక్తత


రాయచోటి(వైఎస్‌ఆర్ జిల్లా), న్యూస్‌లైన్: రాయచోటి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాలు.. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ రెడ్డి పలువురు పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి సోమవారం ఉదయం పాతరాయచోటి ప్రాంతంలోని బ్రాహ్మణవీధి, పోస్టాఫీస్ వీధుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దశాబ్దాల కాలంగా తమకు కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు ప్రచారం చేయడం సహించలేని టీడీపీ నేతలు ఆ ప్రాంతంలోని మహిళలు, చిన్నారులకు జెండాలు ఇచ్చి ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 

వైఎస్సార్‌సీపీ నేతలు సంయమనంతో వ్యవహరించి సర్దుకుపోయారు. గొవడ పెట్టుకోవాలన్న టీడీపీ యత్నాలు ఫలించకపోవడంతో శ్రీకాంత్‌రెడ్డి, ద్వారకనాథ రెడ్డిలపై టీడీపీ కార్యకర్తలు పాతరాయచోటి ప్రధాన వీధిలో రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో వైఎస్సార్‌సీపీ నేత నిత్యానందరెడ్డి తలకు బలమైన గాయమైంది. రవీంద్ర, రఘునాథ, ఆంజనేయులు, కిషోర్ తదితరులు గాయపడ్డారు. 

దాంతో శ్రీకాంత్‌రెడ్డి గన్‌మేన్ జాకీర్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన గందరగోళంలో వీరనాగయ్య గాయపడ్డాడు. వీరనాగయ్య తుపాకీకాల్పులతోనే గాయపడినట్లు టీడీపీ శ్రేణులు అసత్య ప్రచారం చేశాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. శ్రీకాంత్‌రెడ్డి, ద్వారకనాథరెడ్డిల నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు పాత రాయచోటి, పిచ్చిగుంట్లవాండ్ల ఇళ్లు తదితర ప్రాంతాల్లో యథావిధిగా ప్రచారం నిర్వహించి వెనుతిరిగారు. అనంతరం ఆప్రాంతాన్ని ఎస్పీ మనీష్ కుమార్ సిన్హా సందర్శిం చారు. పోలీస్ స్టేషన్‌లో గాయపడిన వారితో మాట్లాడారు. టీడీపీ నాయకులు ప్రచారం చేసినట్లు వీరనాగయ్య తుపాకీ కాల్పుల కారణంగా గాయపడలేదని ప్రకటించారు.

తన ఇంటిమీదుగా వెళ్లవద్దన్న పాలకొండ్రాయుడు 

విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం తండ్రి మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు తన అనుచరులతో గతంలో తాను నివాసమున్న బ్రాహ్మణ వీధిలోని ఇంటికి వచ్చారు. ఘర్షణ అనంతరం ప్రచారం ముగించుకుని వెనుతిరిగిన వైఎస్సార్‌సీపీ నేతలను తన ఇంటిముందు అడ్డుకున్నారు. తమ ఇంటి ముందునుంచి వెళ్లకూడదని నిలువరించారు. దీంతో డీఎస్పీ జయచంద్రుడు కలుగజేసుకుని మరోమార్గం గుండా వెళ్లాలని వైఎస్సార్‌సీపీ నేతలకు సూచించారు. అందుకు వారు ససేమిరా అనడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. వాదోపవాదాలు తరువాత శ్రీకాంత్ రెడ్డి, ద్వారకనాథ రెడ్డి తదితరులు పాలకొండరాయుడు ఇంటిముందునుంచే వెళ్లారు.


మాజీ ఎంపీపీ వాహనం ధ్వంసం
పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకున్న సమయంలో యండపల్లె నుంచి రాయచోటిలోకి వస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ ఎంపీపీ పోలు వెంకటసుబ్బా రెడ్డికి చెందిన టవేరా వాహనంపై పట్టణంలోని సాయి ధియేటర్ వద్ద టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. వాహనంలోఉన్న డి. రఘునాథ, ఎస్.రవీంద్ర, కిషోర్, శ్రీనివాసులులను చితకబాదారు. ఈ సంఘటనపై పోలు తసుబ్బారెడ్డి రాయచోటి అర్బన్‌పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

రౌడీ రాజ్యానికి కాలం చెల్లింది : శ్రీకాంత్‌రెడ్డి


ప్రజలు చైతన్యవంతులయ్యారని, రౌడీ రాజకీయాలకు ఇక కాలం చెల్లిందని రాయచోటి వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రజల నుంచి తమకు లభిస్తున్న ఆదరణ చూసి టీడీపీ నేత పాలకొండ్రాయుడు జీర్ణించుకోలేక పాతరాయచోటికి చెందిన టీడీపీ కార్యకర్తలు, నేతలను తమపైకి ఉసిగొల్పారని చెప్పారు. పాతరాయచోటి సంఘటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రౌడీ రాజకీయాలను, రిగ్గింగ్ సంస్కృతిని ప్రజలు ఛీత్కరిస్తున్నారని వివరించారు. ఇది మా ఏరియా, ఇక్కడ ప్రచారం చేయకూడదనే సంస్కృతిని పాలకొండ్రాయుడు ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజలే తగురీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రచార సమయంలోనే పాలకొండ్రాయుడు ఇంత పెద్ద ఎత్తున దౌర్జన్యాలకు దిగుతుంటే ఇక ఎన్నికల రోజున మరెన్ని అరాచకాలకు పాల్పడుతారో ప్రజలు గ్రహించాలన్నారు. ఉప ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!