హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు న్యాయస్థానంలో ఉండగా... ఆయనకు 14 ఏళ్లు జైలు శిక్ష తప్పదంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఉన్నాయంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేసింది. సీఎం వ్యాఖ్యలు కోర్టులను, ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని, ఆయనపై వెంటనే చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేశారు. పార్టీ కోశాధికారి పీఆర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు శివకుమార్, పార్టీ స్టేట్ ఐటీ కన్వీనర్ చల్లా మధుసూదన్‌రెడ్డి, టీకే విశ్వేశ్వర్‌రెడ్డి, లీగల్‌సెల్ సభ్యుడు బొల్లం లింగయ్య యాదవ్‌లు సోమవారం సచివాలయంలో భన్వర్‌లాల్‌ను కలిసి ఫిర్యాదు అందజేశారు. జగన్‌కు ఓటు వేస్తే జైలుకు వెళ్తారంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈనెల మూడోతేదీన రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై కూడా చర్యలు చేపట్టాలని కోరారు. మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లు యథేచ్ఛగా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
ఆదర్శ రైతులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, రేషన్ డీలర్లు, ఉపాధి హామీ పథకం అసిస్టెంట్లు, ఆర్‌ఎంపీ డాక్టర్లతో ఎన్నికల సమావేశాలు ఏర్పాటు చేసి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేలా చూడాలని ప్రలోభాలకు గురి చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాయచోటిలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డిపై టీడీపీ వర్గీయులు రాళ్లతో దాడి చేశారని, ఆయన జీపును తగులబెట్టారని, ఆయనను రక్షించేందుకు గన్‌మెన్ గాల్లోకి కాల్పులు జరిపారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రచారం చేసుకోనీయకుండా దాడులకు పాల్పడిన ఈ ఘటనపై విచారణ జరిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న రాజకీయ సమావేశాల్లో సీఎం వెనుక కార్యదర్శులు బాలకృష్ణ, శ్రీధర్‌లు ఉండటం ఎన్నికల కోడ్‌కు విరుద్ధమన్నారు. ఈనెల 3న నెల్లూరు, తిరుపతిలో జరిగిన ఎన్నికల సమావేశాలకు వారు హాజరై కిందిస్థాయి ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నారని, దీనిపై చర్యలు చేపట్టాలని కోరారు.

No comments:
Post a Comment