అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, షర్మిల మంగళవారం అనంతపురం నగరంలో నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభిస్తుండటాన్ని చూసి కాంగ్రెస్ నేతలకు కళ్లు కుట్టాయి. నగరంలో ఎవరూ రోడ్‌షోను టీవీల్లో వీక్షించకూడదనే కుట్రతో కేబుల్ ప్రసారాలను కట్ చేయించారు. అంతటితో ఊరుకోలేదు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి.. రోడ్‌షోను అడ్డుకోవడానికి యత్నించారు. అనంతపురం నగరంలో ప్రచారం చేయడానికి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైఎస్ విజయమ్మ తరఫున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి.గురునాథరెడ్డి అనుమతి తీసుకున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు ఎలాగైనా విజయమ్మ రోడ్‌షోను అడ్డుకోవాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసు అధికారులు మధ్యాహ్నం ఒంటి గంట నుంచే రోడ్‌షోను తొందరగా ముగించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై ఒత్తిడి తెచ్చారు. ఒకవేళ నిర్దేశించిన కాలంలోగా ముగించకపోతే రోడ్‌షోను అడ్డుకుంటామని హెచ్చరించారు. దాంతో.. ప్రచార షెడ్యూలులో ఉన్న గుల్జార్‌పేటను సందర్శించకుండానే విజయమ్మ రోడ్‌షోను ముగించారు. గుల్జార్‌పేటలో ప్రచారం నిర్వహించనందుకు నిండుమనసుతో క్షమించాలని విజయమ్మ, షర్మిల ప్రజలను కోరారు. మరోసారి తప్పనిసరిగా గుల్జార్‌పేటకు వస్తామని.. ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి గురునాథరెడ్డికి మద్దతుగా నిలవాలని కోరారు.
Tuesday, 5 June 2012
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment