YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

కాకినాడ సెజ్‌కు ఆద్యుడు మీ‘బాబే’!

అసలు నిజాన్ని కప్పిపెట్టేందుకు ‘ఈనాడు’ విశ్వప్రయత్నం 
బాబు బినామీగా పేరుపడ్డ కె.వి.రావుకే సెజ్ అప్పగింత 
ఆ సెజ్ ద్వారా రూ. 400 కోట్ల కుంభకోణం ఆరోపణలు 
దీనిపై కోర్టులో పిటిషన్ కూడా వేసిన వై.ఎస్.విజయమ్మ 
బాబు నిర్వాకాన్ని దాచేసి.. వైఎస్‌పై నిందమోపిన ‘ఈనాడు’
చదరపు గజాలనూ అడుగులుగా మార్చి చూపిన వైనం 
నిర్వాసితుల సంఖ్య, గ్రామాల లెక్క... అన్నీ అబద్ధాలే 

దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉంది కాకినాడ సెజ్ విషయంలో ‘ఈనాడు’ కథనం. కాకినాడ సెజ్‌ను ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హయాంలో. ఇందుకోసం భూసేకరణ ప్రక్రియను చేపట్టిందీ ఆయనే. సెజ్‌లకు అనేక రాయితీలు ఇవ్వాలని కేంద్రాన్ని కోరిందీ బాబే. తమ ‘బాబే’ చేసిన ఈ నిర్వాకాలన్నీ ‘ఈనాడు’ పచ్చకామెర్ల కళ్లకు కనిపించవు. కేవలం గతంలో ప్రారంభమైన ఒక పరిశ్రమకు అవసరమైన భూమిని కేటాయించటమే మహా నేరమైనట్టు అడ్డగోలు రాతలకు ‘ఈనాడు’ బరితెగించింది. ఈ క్రమంలో కనీస పత్రికా ప్రమాణాలను కూడా గాలికొదిలేసింది. ఈ పైత్యం ఎక్కడిదాకా వెళ్లిందంటే.. చదరపు గజాలను కూడా అడుగులుగా మార్చేంత దాకా! 

2002 ఏప్రిల్ 23న బాబు జీవో జారీ... 

కాకినాడ సెజ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే. ఈ సెజ్‌ను ఏర్పాటు చేస్తూ 2002 ఏప్రిల్ 23న జీవో 196ను చంద్రబాబు ప్రభుత్వమే విడుదల చేసింది. కాకినాడ సెజ్‌కు భూవుులు కేటారుుంచాలని ఆదేశాలు జారీచేసింది. చంద్రబాబును పల్లెత్తు వూట అనని.. ‘ఈనాడు’ అదంతా దివంగత వైఎస్‌పై మోపేందుకు ప్రయుత్నించింది. వాస్తవానికి కాకినాడ సెజ్‌ను అభివృద్ధి చేస్తున్న కె.వి.రావు.. చంద్రబాబు బినామీ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆయనకు అప్పనంగా కాకినాడ పోర్టు, సెజ్‌ను అప్పగించారని కూడా ఆరోపించారు. ఇవేవీ ‘ఈనాడు’ కళ్లకు కనిపించవు.

ఏకంగా 9,500 ఎకరాల కేటాయింపు... 

వాస్తవానికి కాకినాడ సెజ్ కోసం 2,500 ఎకరాలు అవసరమని మొదట్లో భావించారు. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా 9,500 ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్పట్లోనే ‘వార్త’ దినపత్రిక పెద్ద కథనాన్ని ప్రచురించింది కూడా. ఈ కథనాన్ని అటు ప్రభుత్వం కానీ, ఇటు సంబంధిత శాఖ కానీ ఖండించలేదు. ఈ సెజ్ ఏర్పాటులో భారీ కుంభకోణం జరిగిందని, మొత్తం రూ. 400 కోట్లు (అప్పట్లో దాని విలువ) దోచి పెట్టారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సెజ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందనే విమర్శలూ వచ్చాయి. కానీ.. బాబు ఇవేవీ పట్టించుకోలేదు. తన బినామీకి ఈ సెజ్‌ను అప్పగించేందుకు చేయాల్సిన సహాయమంతా చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే.. ‘ఈనాడు’ మంగళవారం నాటి సంచికలో వైఎస్‌ను దోషిగా చూపటానికి కట్టుకథలు ప్రచురించడం విషప్రచారానికి పరాకాష్ట. 
పారిశ్రామికీకరణే ఆయన విధానం... 

చంద్రబాబు హయాంలోనే కాకినాడ సెజ్ ప్రారంభం కావటంతో.. దానికి సంబంధించి మిగిలిన భూసేకరణ ప్రక్రియకు వైఎస్ ప్రభుత్వం సహకరించింది. ఇందులో ఆయన చంద్రబాబు బినామీనా? రామోజీ బినామీనా? అని వైఎస్ ఆలోచించలేదు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను వైఎస్ కొనసాగించారు. అంతే. కేవలం రాజకీయ వైరంతో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోకూడదనేది వైఎస్ ఫిలాసఫీ. అయితే భూమిని కోల్పోయిన నిర్వాసితులకు మాత్రం కచ్చితంగా సహాయ, పునరావాస ప్యాకేజీని అమలు చేయాలని ఆయన ఆదేశించారు. ఇందులో ఆయన ఎక్కడా రాజీపడలేదు. పునరావాస కేంద్రాల్లో 925 ఇళ్లను నిర్వాసితులకు సొంతంగా రిజిస్ట్రేషన్ చేసి మరీ అప్పగించారు. సేకరించిన భూమిలో 80 శాతం ఇసుక మేటలు, సరుగుడు తోటలు ఉన్న భూములే. ‘ఈనాడు’ చెప్పినట్టుగా.. కొబ్బరి, జీడిమామిడి, మామిడి తోటలున్న ప్రాంతం కాదు. సెజ్ పరిధిలోకి వస్తున్న 30 గ్రామాల్లోని 5,000 మంది నిర్వాసితులవుతున్నారని ‘ఈనాడు’ ఆరోపించింది. అయితే, వాస్తవానికి కేవలం 12 గ్రామాల్లోని 1,497 కుటుంబాలను మాత్రమే ఖాళీ చేయించారు. 

అడుగులకు, గజాలకు తేడా తెలీదా? 

వైఎస్‌పై నిందలు మోపే క్రమంలో ‘ఈనాడు’ అధినేత రామోజీరావు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఏకంగా భూమి కొలతలనూ మార్చేసింది. చదరపు గజాలను అడుగులుగా మార్చేసింది. కాకినాడ సెజ్ నిర్వాసితులకు 300 అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు కట్టిస్తామని చెప్పి 180 అడుగుల విస్తీర్ణంలోనే ఇళ్లను నిర్మించి ఇచ్చారని ‘ఈనాడు’ ఆరోపించింది. వాస్తవానికి నిర్వాసితులకు 180 చదరపు గజాల స్థలంలో 320 అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు కట్టించాలనేది నిర్ణయం. ఈ మేరకు ఇళ్లను సంబంధిత సంస్థ నిర్మించి ఇచ్చింది. కానీ.. ‘ఈనాడు’కు చదరపు గజాలకు, అడుగులకు తేడా తెలియకపోవటం విడ్డూరంగా ఉంది. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!