సర్కారు వారి కొత్త మద్యం లెసైన్స్ విధానం
6,596 దుకాణాలకు నేడే లాటరీ నోటిఫికేషన్
పాన్ కార్డు, మూడేళ్ల ఐటీ రిటర్న్స్ తప్పనిసరి
సొమ్మంతా వైట్ మనీ అని రుజువులు చూపాలి
ముందు ఏడాది కాలానికే దుకాణం లెసైన్స్
ప్రవర్తన సరిగా ఉంటే మరో ఏడాది పొడిగింపు
హైదరాబాద్, న్యూస్‌లైన్: కొత్త ఎక్సైజ్ పాలసీ విధివిధానాలు ఖరారయ్యాయి. లాటరీ పద్ధతిలోనే దుకాణాలకు లెసైన్స్‌లు కేటాయించాలని నిర్ణయించారు. సోమవారం దీనిపై ఉత్తర్వులు, లాటరీ నోటిిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం నడుస్తున్న 6,596 దుకాణాలతో పాటు కొత్తగా మరో 750 దుకాణాలు పెంచాలనే ప్రతిపాదన పట్ల ముఖ్యమంత్రి నిరాసక్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాత మద్యం పాలసీలో అస్పష్ట విధివిధానాలపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కొన్ని కఠినమైన నిబంధనలు రూపొందించారు.
లెసైన్స్‌కు దరఖాస్తు చేసుకునే ఔత్సాహికులకు పాన్‌కార్డు, మూడేళ్ల ఐటీ రిటర్న్స్ ఉండాలి.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్‌కార్డుదారులు దరఖాస్తుకు అనర్హులు.
మద్యం దుకాణానికి నిర్ణయించిన అప్‌సెట్ ధరలో మూడో వంతు సొమ్మును దరఖాస్తు చేసుకునే సమయంలోనే జమ చేయాలి. ఈ మొత్తం సొమ్ము కూడా తెల్లధనమే అని రుజువు చేసే పత్రాలు జత చేయాలి.
లెసైన్స్ పొందిన వాళ్లు బ్యాంకు గ్యారంటీల కింద చూపించే స్థిరాస్తులు తమ సొంతమేనని స్థానిక తహశీల్దారు సర్టిఫై చేసిన ధ్రువీకరణ పత్రం జత చేయాలి.
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
గిరిజన ప్రాంతాల్లో మద్యం దుకాణం తెరిచేవాళ్లు తప్పనిసరిగా ఆయా గ్రామ పంచాయతీ అంగీకార తీర్మానం పత్రాన్ని జతచేయాలి.
లెసైన్సు కాల పరిమితి ఏడాది. ఈ ఏడాది కాలంలో దుకాణదారుని ప్రవర్తన సరిగా ఉంటే (ఎలాంటి కేసులు కాకుండా ఉంటే) అతనికే మరో ఏడాది పాటు లెసైన్స్ గడువును పొడిగిస్తారు.
లెసైన్స్ పొందిన వ్యక్తులు దుకాణం కౌంటర్‌లో ఎవరు కూర్చుంటారు, ఎంత మంది పనివాళ్లు ఉంటారో ముందుగానే చెప్పాల్సి ఉంటుంది.
ఒకవేళ ఒక లెసైన్సీ, దుకాణంలో భాగస్వామిని చేర్చుకుంటే వారి పేరు ముందుగానే నమోదు చేయించాలి.

No comments:
Post a Comment