- నిమ్స్‌లో తుది శ్వాస విడిచిన మాజీ ఎమ్మెల్యే వీరభద్రరావు
- జగన్‌తోనే పోలవరం సాధ్యమనే నమ్మకంతో వైఎస్సార్ సీపీలో చేరిక
హైదరాబాద్/రాజానగరం (తూర్పుగోదావరి), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తూర్పుగోదావరి జిల్లా కడియం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వడ్డి వీరభద్రరావు (70) ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో మృతి చెందారు. పూర్వపు కడియం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వీరభద్రరావు కొద్ది కాలం క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో రామచంద్రపురంలో ప్రచారం చేస్తుండగా ఆయన కాలికి గాయమైంది.
అది మానకపోవడంతో రాజమండ్రిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆయనకు తీవ్రమైన గుండె నొప్పి రావడంతో ఆదివారం మధ్యాహ్నం బంధువులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆరోగ్య పరిస్థితి విషమించి రాత్రి 8 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మృతదేహాన్ని కడియంకు తరలించారు. ఆయనకు భార్య నాగవేణమ్మ, కుమారుడు శేషుకుమార్ (బాబు), కుమార్తె పద్మ ఉన్నారు. నిమ్స్‌లో వీరభద్రరావు భౌతికకాయాన్ని వైఎస్సార్ సీపీ తూర్పు గోదావరి జిల్లా నేతలు జక్కంపూడి రాజా, గుర్రం గౌతమ్ సందర్శించారు. ఆయన కుమారుడు శేషుకుమార్‌ను పరామర్శించారు.
వీరభద్రరావు అంత్యక్రియల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు అంబటి రాంబాబు పాల్గొంటారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం నరేంద్రపురానికి చెందిన వీరభద్రరావు 1975లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. తొలుత నరేంద్రపురం సర్పంచ్‌గా, తర్వాత నందరాడ సొసైటీ అధ్యక్షునిగా వ్యవహరించారు. 1985, 94లలో రెండుసార్లు పూర్వపు కడియం నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
1989లో జక్కంపూడి రామ్మోహనరావుపై పోటీ చేసి ఓడిపోయారు. 1999లో టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో మనస్తాపానికి గురయ్యారు. 2004లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. 2009లో పీఆర్పీలో చేరి రాజానగరం టిక్కెట్టు కోసం ప్రయత్నించారు. టికెట్టు రాకపోవడంతో కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత పోలవరం ప్రాజెక్టు సాధన కోసం ఆయన తీవ్ర కృషి చేశారు. రాజమండ్రి నుంచి ఢిల్లీ వరకూ బిందెలతో గోదావరి జలాలను తీసుకువెళ్లి అప్పటి ప్రధాని దేవెగౌడకు అందజేశారు.
పోలవరం వరకూ పాదయాత్ర కూడా చేశారు. పోలవరం ప్రాజెక్టు సాధన ఒక్క జగన్‌తోనే సాధ్యమనే నమ్మకంతో ఏడాది క్రితం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. జగన్ చేపట్టిన పోలవరం హరితయాత్రలో పాల్గొన్నారు. గత నెలలో ‘జగన్‌ను సీఎంను చేద్దాం.. పోలవరం సాధించుకుందాం’ అనే నినాదంతో రాజానగరం నియోజకవర్గంలో గ్రామగ్రామానా
ప్రచారం చేశారు.

No comments:
Post a Comment