* వైఎస్ మరణాన్ని తట్టుకోలేక గుండెలాగిన వారి కుటుంబాలను కాంగ్రెస్ ఇప్పటికీ పరామర్శించలేదు
* జగనన్న ఓదార్పు చేస్తే.. జైల్లో పెట్టారు
ఎమ్మిగనూరు, కర్నూలు, న్యూస్‌లైన్ ప్రతినిధులు: ‘‘జగన్ కాంగ్రెస్‌లో ఉంటే సీఎంను చేసేవాళ్లమని ఆ పార్టీ పెద్ద గులాం నబీ ఆజాద్ అన్నారు. అంటే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే జైల్లో పెట్టాలనే వారి కుట్రలు బట్టబయలయ్యాయి’’ అని షర్మిల విమర్శించారు. ‘‘మహానేత తెచ్చిన అధికారంతో కాంగ్రెస్ పెద్దలు ఆయన కుటుంబాన్నే వేధిస్తున్నారు.
విచారణ పేరిట జగనన్నను జైలుకు పంపారు. వైఎస్‌ను అప్రతిష్టపాలు చేయాలని, జగనన్నను మీ మదిలో నుంచి తీసేయాలని కుట్రలు చేస్తున్నారు. చివరకు మా నాన్నను మేమే చంపుకొన్నామని నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. ఈ కుట్రలన్నీ వారు ఉప ఎన్నికల్లో గెలవాలనే చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి.. వైఎస్ మీ గుండెల్లో ఉన్నారని, జగన్ నిర్దోషి అని చాటి చెప్పండి’’ అని ఆమె ఓటర్లకు విన్నవించారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోలలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నాన్న మృతి వార్తతో 600 మంది గుండెలు ఆగాయి. ఆ కుటుంబాలను ఇంత వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం పరామర్శించలేదు. వారికి పరిహారమూ ఇవ్వలేదు. ఆ కుటుంబాలను ఓదార్చేందుకు జగనన్న ముందుకు కదిలితే జైల్లో పెట్టారు. కోర్టుకు పోయాం, ప్రధాన మంత్రికి విన్నవించాం. ఫలితం లేదు.. ప్రజా కోర్టులో తేల్చుకుందామని అమ్మ, నేను జనంలోకి వచ్చాం. జగనన్న ఎలాంటి వాడో మీరే తీర్పు చెప్పండి’’ అని షర్మిల కోరారు.
బొత్స చేస్తే అవినీతి కాదా?: ‘‘బొత్స సత్యనారాయణపై మద్యం సిండికేట్ కేసులున్నాయి. ఆయన వందల కోట్లు సంపాదించాడు. ఆయన అవినీతి పరుడు కాదా? ఆయన్ను ఏసీబీ విచారించదా? అధికారంలో ఉన్నారు కాబట్టి కేసును మూసేస్తున్నారు. వైఎస్ పథకాలు కాంగ్రెస్‌వే అని చిరంజీవి అంటున్నారు.
ఆ పథకాలను వైఎస్ ప్రవేశపెట్టినపుడు చిరంజీవి ఎక్కడ ఉన్నారు? ఆయనకేం తెలుసు పథకాల గురించి?’’ అని షర్మిల ప్రశ్నించారు. చిరంజీవి కుమార్తె ఇంట్లో కోట్ల రూపాయలు దొరికాయని, ఆయనకు అంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందని ఆమె నిలదీశారు. ఇంట్లోనే ఆయనకు ఇంత డబ్బు ఉంటే బయట ఇంకెంత ఉందోనని అన్నారు.
చంద్రబాబేమో.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓట్లేస్తే ప్రజలనే జైల్లో పెడతామని అంటున్నారని, జగనన్నను ఏం చేయలేక జనాన్ని బెదిరిస్తున్నారని విమర్శించారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. నీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘జగనన్న మాతో, భార్యాబిడ్డలతో కంటే ప్రజల్లోనే ఎక్కువగా ఉన్నారు. ప్రజా సమస్యలను తన సమస్యలుగా భావించారు. అలాంటి జగనన్నకు అండగా నిలిచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి’’ అని కోరారు. ఎవ్వరూ భయపడాల్సిన పనిలేదని, త్వరలోనే జగన్ జైలు నుంచి బయటకు వస్తారని ఆమె చెప్పారు.

No comments:
Post a Comment