తిరుపతి, న్యూస్‌లైన్ : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాశ్వత బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినపుడు తాత్కాలిక బెయిల్‌కోసం పిటిషన్ దాఖలు చేయలేదన్న వాదనలో అర్థం లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సానుభూతితో ఓట్లు పొందేందుకు జగన్‌మోహన్‌రెడ్డి తాత్కాలిక బెయిల్ కోరకుండా జైలులోనే వుండాలనుకున్నారన్న లగడపాటి, ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యలపై అంబటి మండిపడ్డారు. లగడపాటిని ఒక కార్పొరేట్ బఫూన్‌గా అని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఉండవ ల్లి అరుణ్‌కుమార్ అలాంటి వ్యాఖ్యలు చేస్తారని తాను అనుకోలేదన్నారు.
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వీలుగా 10 రోజులు గడువు కావాలని, 11వ తేదీ కోర్టుకు హాజరవుతానని సీబీఐ కోర్టును జగన్ అభ్యర్థించిన సంగతిని అంబటి గుర్తు చేశారు. న్యాయనిపుణుల బృందం ఎలా చెబితే జగన్ అలా చేస్తారని దీన్ని రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనుకోవడం అవివేకమన్నారు. జగన్ అరెస్ట్ వెనుక సోనియా హస్తం వుందని జాతీయ పత్రికలు కోడై కూస్తున్నాయన్నారు.
No comments:
Post a Comment