YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 6 June 2012

షిర్డీ, తిరుమల వెళ్లేందుకు అనుమతించండి..



హైదరాబాద్, న్యూస్‌లైన్: షిర్డీ సాయిబాబాను, తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు అనుమతించాలని జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో నిందితుడిగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఆయన తరఫు న్యాయవాది జి.అశోక్‌రెడ్డి బుధవారం పిటిషన్ దాఖలు చేశారు.

ఈనెల 9వ తేదీ నుంచి 11 వరకు షిరిడీ, 13 నుంచి 16వ తేదీ వరకు తిరుమల సందర్శించేందుకు అనుమతించాలని కోరారు. సాయిరెడ్డికి ఏప్రిల్ 30న బెయిల్ మంజూరు సందర్భంగా హైదరాబాద్ విడిచి వెళ్లరాదని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతు విధించింది. ఈ నేపథ్యంలో పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం సీబీఐ అభ్యంతరాలను వినేందుకు వీలుగా విచారణను గురువారానికి వాయిదా వేసింది.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!