* సాక్షి పత్రిక, టీవీని మూయించాలని టీడీపీ, కాంగ్రెస్ కోరాయి
* మీడియాను క్లోజ్ చేయడం సాధ్యం కాదని ఈసీ చెప్పింది
హైదరాబాద్, న్యూస్‌లైన్: సాక్షి పత్రిక, టీవీలను మూసివేయలేమని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. సాక్షి పత్రిక, టీవీలను మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కోరాయని, దీనిపై ఎన్నికల కమిషన్ (ఈసీ) న్యాయ సలహా కోరగా.. మీడియా సంస్థలను మూసివేయడం కమిషన్‌కు సాధ్యం కాదని, మూసివేత అంశం కమిషన్ పరిధిలోకి రాదని జవాబు వచ్చినట్లు ఆయన తెలిపారు. బుధవారం తనను కలిసిన విలేకరులతో సీఈఓ మాట్లాడారు. తొలుత తెలుగుదేశం పార్టీ చేసిన ఫిర్యాదు మేరకు సలహా కోరానని, అయితే మీడియాను మూసేయడం సాధ్యం కాదనే సమాధానం వచ్చిందని వెల్లడించారు. తరువాత కాంగ్రెస్ పార్టీ కూడా సాక్షి పత్రిక, టీవీని మూసేయాల్సిందిగా కోరుతూ ఫిర్యాదు చేయగా.. అంతకుముందు ఈసీ పేర్కొన్న విషయాన్నే కాంగ్రెస్ నాయకులకు తెలియజేసినట్లు భన్వర్‌లాల్ చెప్పారు.
పెయిడ్ న్యూస్ విషయంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఆరోపణలు చేయవచ్చునని, అయితే ఈసీ మాత్రం నిబంధనల ప్రకారం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. పెయిడ్ న్యూస్‌పై వచ్చిన ఫిర్యాదులన్నింటినీ జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన గల కమిటీకి పంపిస్తున్నామని, వారే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని, ఆ కమిటీ పరిశీలన సరిగా ఉందా లేదా అనే విషయాన్ని ఈసీ నియమించిన పరిశీలకుడు పర్యవేక్షిస్తారని చెప్పారు.
ఆభరణాల తయారీ ఆర్డర్లపై నిఘా
ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేలా బంగారు, వెండి ఆభరణాల పంపిణీని నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటివరకు రూ.34.37 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నామని, అలాగే రూ.8.87 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలను, చీరలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 1.75 లక్షల లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఐటీ శాఖ దర్యాప్తు పూర్తి కాకుండా స్వాధీనం చేసుకున్న డబ్బులు ఏ పార్టీకి చెందినవో చెప్పలేమని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు.
ఎన్ని వాహనాలతోనైనా ప్రచారం చేసుకోవచ్చు
ఉప ఎన్నికల ప్రచారంలో ఎన్ని వాహనాలనైనా వినియోగించుకోవచ్చునని, ఎటువంటి ఆంక్షలు లేవని సీఈఓ చెప్పారు. అయితే అనుమతి మాత్రం తీసుకోవాలన్నారు. 2009 ఎన్నికల సందర్భంగా వాహనాల సంఖ్యపై కమిషన్ ఆంక్షలను తొలగించిందన్నారు.
ఫిర్యాదులపై కలెక్టర్ల నుంచి నివేదికలు
కసాయి వాళ్లకు ఓటేస్తారా అంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఉపన్యసించడంపై ఫిర్యాదు వచ్చిందని, దానిపై కర్నూలు కలెక్టర్ నుంచి నివేదిక కోరతామని ఆయన చెప్పారు.

No comments:
Post a Comment