హైదరాబాద్, న్యూస్‌లైన్: పరకాలలో వైఎస్ విజయమ్మ పర్యటనను అడ్డుకుంటామన్న టీఆర్ఎస్పై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొల్లం లింగయ్య యాదవ్, పీఎన్వీ ప్రసాద్ తదితరులు బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ఉప ఎన్నికల నేపథ్యంలో 8న విజయమ్మ పరకాల నియోజకవర్గంలో పర్యటించాలని నిర్ణయించారని, అయితే ఈ పర్యటనను అడ్డుకుంటామని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రకటనలు ఇస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని చెప్పారు

No comments:
Post a Comment