ఈ రోజు జైలులో ఉన్నవారు రేపు మహానాయకులు కావచ్చు. నేడు మహానాయకులుగా ఉన్న వారు రేపు జైలుపాలు కావచ్చు. అంతా ప్రజల రాజకీయ చైతన్యంపై ఆధారపడి ఉంటుంది. ప్రజల దీవెనలు మీకు శ్రీరామరక్షలా నిలుస్తాయి. మీరు ప్రజలను నమ్మారు. మీ తండ్రి ప్రజల కోసం పనిచేశారు. ప్రజలు మీకు, మీ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచి తమ రుణం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. జనం ప్రభంజనం సృష్టించబోతున్నారు. ఆ ఆనందానుభూతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి
చిరంజీవి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి... అనేక దీవెనలతో ‘కదలిక’ ఇమామ్ అనంతపురం నుంచి రాస్తున్న ఉత్తరం. మహా కవి శ్రీశ్రీ ఒక సందర్భంలో ‘‘దేశంలో జైళ్లలో ఉండాల్సినవారందరూ బయట ఉన్నారు. ప్రజల్లో ఉండాల్సినవారు జైళ్లలో ఉన్నారు’’ అని చమత్కరించారు. ప్రస్తుత స్థితి ఆ మహాకవి చెప్పిన మాటలను గుర్తుచేస్తోంది. వైఎస్ మరణించిన కొంత కాలానికి రాజమండ్రి లోక్‌సభ సభ్యులు ఉండవల్లి అరుణ్‌కుమార్, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మిమ్మల్ని నాకు తొలిసారిగా పరిచయం చేశారు. ప్రత్యేకించి ఉండవల్లి అరుణ్‌కుమార్ నన్ను అనంతపురం జిల్లా టైస్టుగా పరిచయం చేశారు.
మీ తండ్రిగారికి నేను అత్యంత సన్నిహితుడినని కరుణాకర్‌రెడ్డి చెప్పారు. అప్పుడు... బెంగళూరులోని కోరమంగళ్, 80 ఫీట్ రోడ్డులో మీ తండ్రి నన్ను మీకు పరిచ యం చేసిన సందర్భాన్ని నవ్వుతూ మీరు నాకు గుర్తుచేశారు. మీ జ్ఞాపకశక్తికి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్ అంట కదా మీరు! ఆ అంశాల మీద నన్ను గైడ్ చేయాలని కోరారు. అందుకు బదులిస్తూ నేను... ‘‘ఒక ఇరిగేషన్ గురించి ఏమిటి! మా జీవిత సర్వస్వం మీకోసం, మీరు ముఖ్యమంత్రి కావడం కోసం అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నాను.
ఒక విషయం గుర్తుంచుకోవాలని చెప్పాను. అదేమిటంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టవలసిందిగా కొందరు మీ మీద తెస్తున్న ఒత్తిడికి తలవంచవద్దని చెప్పాను. మీ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఏ విధంగానూ ఆభరణం కాదు. ముఖ్యమంత్రి పదవికే మీ కుటుంబం ఆభరణం, గౌరవం. ముఖ్యమంత్రి పదవికి వన్నె తెచ్చే కుటుంబం మీది. అందుకే వారు చేస్తున్న ప్రయత్నాలకు దూరంగా ఉండాలని చెప్పాను.
అలాగే ఇక నుంచి మీకు వ్యక్తిగత జీవితం లేదు. ప్రజల్లోకి మీరు ఏ రకంగా వెళతారో నాకైతే తెలియదు. మీరు ప్రజల్లోకి వెళ్లండి. మిమ్మల్ని ప్రజలు దీవిస్తారు. ఆశీర్వదిస్తారు. ముఖ్యమంత్రి పదవిని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిగారే మీ చెంతకు తీసుకొస్తారని అభిప్రాయ పడ్డా ను. అప్పుడు మీరు గంభీరంగా మారిపోయి కళ్లల్లో పెల్లు బుకుతున్న కన్నీటిని ఆపుకుంటూ నన్ను కౌగిలించుకున్న తీరు నేనిప్పటికీ నెమరు వేసుకుంటున్నాను.
ఓదార్పుయాత్రతో పాటు, పోలవరం కోసం పాదయాత్ర, రైతుల కోసం లక్ష్య దీక్ష, విద్యార్థుల ఫీజురీయింబర్స్‌మెంట్ కోసం ఫీజు పోరు, చేనేత కార్మికుల కోసం చేనేత దీక్ష, ఆర్మూర్‌లో రైతుల కోసం దీక్ష, విద్యుత్ చార్జీల పెరుగుదలను నిరసిస్తూ మొగల్తూరులో దీక్ష... చేసి మీరు ప్రజల్లోకి వెళ్లారు. రాష్ట్రంలో నెల్లూరు జిల్లా నుండి శ్రీకాకుళం వరకూ 23 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశారు. దేశంలో ఏ నాయకుడు ప్రజల్లోకి ఇంత విస్తృతంగా వెళ్లి వారిని పరామర్శించిన దాఖలాలు లేవు.
ప్రజలు మీలో మీ నాయన వైఎస్‌ను చూసి తన్మయం పొందారు. లేపాక్షి నుంచి పోతిరెడ్డిపాడుకు 1986 డిసెంబర్‌లో, 2003లో చేవెళ్ల నుండి ఇచ్ఛాపురంకు వైఎస్ జరిపిన పాదయాత్రలకు ఏమాత్రం తగ్గకుండా అంతే దీక్షతో, అంతే పోరాటపటిమతో మీరు ప్రజల్లోకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, ప్రత్యేకించి సోనియాగాంధీ మీ ఓదార్పుయాత్రను అంగీకరించకపోయినా, మీరు ఎంపీ పదవిని, మీ తల్లి ఎమ్మెల్యే పదవిని త్యజించి తిరిగి ప్రజల్లోకి వెళ్లి రికార్డు స్థాయిలో మెజారిటీ ఓటర్ల మన్ననలు పొంది రాష్ట్రంలో ఒక చరిత్రనే సృష్టించారు.
మీరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానా న్ని తిరస్కరించారని, సోనియా బృందానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళుతున్నారని కక్షబూని సోనియా నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కనుసన్నల్లో మీరు నిర్వహిస్తున్న ‘సాక్షి’ పత్రికపై దాడులకు పాల్పడ్డారు. రాష్ట్రంలో రెండవసారి చంద్రబాబు, రామోజీరావు, అంబానీల కలయికకు వ్యతిరేకంగా నిలబడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర వహించినందుకే సాక్షి పత్రికపై కాంగ్రెస్ పెద్దలు, రామోజీరావు, చంద్రబాబుతో కలసి దాడులు నిర్వహించారన్నది ప్రజానీకం ఇప్పటికే గ్రహిం చింది.
అవినీతి ఆరోపణలతో మిమ్మల్ని హింసించాలని చూడటం ప్రజలను కలవరపరిచింది. మీరు ఇంత నిబ్బరంగా కాంగ్రెస్-టీడీపీ అపవిత్ర కలయికను పర్వతంలా నిలిచి ఎదుర్కొన్న తీరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. మీరు ప్రజల్లోకి వెళ్లిన తీరు, నాయకునిగా ఎదుగుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తును నిర్దేశించుకున్నారనే గట్టి నమ్మకం నాకు కలుగుతున్నది.
రాజకీయ జీవితంలో భాగంగా జైళ్లలో ఉండటం అనివార్యమే కాదు, ఒక అపూర్వమైన అవకాశం కూడా. నెహ్రూ తన కుమార్తె ఇందిరకు జైలు నుంచి రాసిన ఉత్తరాలు మహత్తర గ్రంథం ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’గా అజరామరంగా నిలిచిపోయింది. ఇక్కడ ఒక సందర్భం మీకు గుర్తుచేయాలి. మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి మద్రాసు రాష్ట్రంలో ప్రొహిబిషన్ శాఖామాత్యులుగా ఉన్నప్పుడు 1952లో అనంతపురం అసెంబ్లీ స్థానానికి దివంగత విప్లవ కమ్యూనిస్టు నాయకులు తరిమెల నాగిరెడ్డితో పోటీపడ్డారు. తరిమెల నాగిరెడ్డి జైలు నిర్బంధంలో ఉన్నా రు. జైలు నుంచే ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు.
సంజీవరెడ్డిని ఎన్నికల్లో గెలిపించేందుకు స్వయంగా నాటి ప్రధాని నెహ్రూ అనంతపురం వచ్చారు. ప్రచారం నిర్వహించిన తరువాత ఒక రాత్రి బస చేసి సంజీవరెడ్డి విజయానికి వ్యూహరచన చేశారు. దాదాపు లక్ష ఓటర్లు ఉన్న అనంతపురం నియోజకవర్గంలో సంజీవరెడ్డిని 12 వేల మెజారిటీతో ఓడించి తరిమెల నాగిరెడ్డి విజయం సాధించారు. ఇదే అంశాన్ని ఓ సందర్భంలో సంజీవరెడ్డి ఒక బహిరంగ సభలో తెలియజేస్తూ ‘‘ఆ నాయకుడు మనకు అనుకూలం, ఈ నాయకుడు మనకు ప్రతికూ లం... వంటివేవీ పనిచేయవు. ప్రజలు గాని అనుకుంటే మనం అధికారంలో ఉన్నా ఓడిస్తారు’’ అని నాగిరెడ్డితో తన ఓటమిని గుర్తుచేశారు.
ఈ సందర్భం మీకు నేను ఎం దుకు గుర్తుచేస్తున్నానంటే ప్రజల హృదయాల్లో పదిలంగా ఉన్న నాయకులకు జైలుగోడలు అడ్డుగా నిలవలేవు. ప్రజ లు ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు. విజ యమ్మ, షర్మిలమ్మ, భారతి తదితరులు దిల్‌కుషా గెస్ట్‌హౌస్ ముందు కంటతడి పెట్టిన సందర్భం కోట్లాది ప్రజల హృదయాల్లో మంటలు రేకెత్తించిందని చెప్పడానికి నేను సంకోచించడం లేదు. ఎందుకంటే పాయకరావుపేట, రామచంద్రపురం, పోలవరం తదితర ప్రాంతాల్లో విజయమ్మతో పాటు నేను ఎన్నికల ప్రచారంలో సామాన్యుడిగా పాల్గొన్నాను. ప్రజల స్పందనను గమనించాను.
బస్టాండ్‌లలో, బస్సుల్లో, రైల్వే స్టేషన్లలో, రైళ్లలో, టీ హోట ళ్లలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. రాజశేఖరరెడ్డి కుటుంబానికి అన్యాయం జరిగింది. ఆ కుటుంబానికి మనం అం డగా నిలబడాలన్న లక్ష్యం స్పష్టంగా నాకు కనిపించింది. ఒక విషయం... నాయకులు విపత్కర పరిస్థితుల్లో సంయమనం కోల్పోకూడదు. భగవద్గీతలో చెప్పినట్లు స్థితప్రజ్ఞత అనేది నాయకుడి ప్రధాన లక్షణం. కృష్ణుడు అర్జునుడికి చెప్పినట్లు సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని, దౌర్జన్యాలకు దిగరాదని ప్రజలకు మీరు చేసిన విజ్ఞప్తి ప్రశంసనీయం.
మీ విజ్ఞప్తికి స్పందించి ప్రజలందరూ ఎంతో నమ్రతతో సహనం పాటించారు. రాబోయే ఉప ఎన్నికల్లో 18 అసెంబ్లీ స్థానాలను, ఒక పార్లమెంటు స్థానాన్ని మీరు అప్పటి వరకూ జైలులో ఉంటే కానుకగా మీకు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మిమ్మల్ని దీర్ఘకాలం జైలులో నిర్బంధించడానికి రాష్ట్రంలోని సోని యా అనుచర వర్గం అనేక కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది. అనేక కేసులలో ఇరికించి జైలు నుంచి బయటకు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది. జైలులో మీ సమయాన్ని నిర్మాణాత్మకంగా గడపడానికి ప్రణాళికను సిద్ధం చేసుకోండి. రాజకీయంగా ఎదగడానికి, అనుభవాలను నెమరువేసుకోవడానికి, ప్రపంచంలో సంభవిస్తున్న రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిణామాలను అధ్యయనం చేయడానికి మీ సమయాన్ని వెచ్చించండి.
ఎమర్జెన్సీలో ఏడాది పాటు ముషీరాబాద్ జైలులో గడిపిన అనుభవంతో కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను. జైలులో శిక్షలు అనుభవిస్తున్న నేరస్తులందరూ భయంకరులు కాదు. మీ నాన్నగారి ఆశీస్సులతో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా ఎదిగి వచ్చి, మీ కుటుం బం పట్ల, మీ పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నవారిని దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు, ప్రస్తుతం జైలులో ఉన్న నేరస్తులు ఎంతో విశాల హృదయులని చెప్పక తప్పదు. మీ సమయం వారితో వెచ్చించి, వారి జీవితాలను గమనించి వారికి సహకరించడానికి, సహాయం చేయడానికి, ఆదరించడానికి మీ వంతు ప్రయత్నం చేయండి.
1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భంగా జైలు పాలై న దివంగత మాజీ రైల్వేశాఖ మంత్రి మల్లికార్జున్ జైలు నుంచి బయటకు వస్తూ ‘‘ఈ జైలు గేట్లను అలాగే తెరిచి ఉంచండి. మమ్మల్ని జైలుకు తోలిన వారు జైలులోకి వచ్చే రోజు ఎంతో దూరం లేదు’’ అంటూ ఛలోక్తి విసిరారు. ఈరోజు జైలులో ఉన్నవారు రేపు మహానాయకులు కావచ్చు.
నేడు మహానాయకులుగా ఉన్న వారు రేపు జైలుపాలు కావచ్చు. అంతా ప్రజల రాజకీయ చైతన్యంపై ఆధారపడి ఉంటుంది. ప్రజల దీవెనలు మీకు శ్రీరామరక్షలా నిలుస్తాయి. విజయమ్మకు, షర్మిలకు ప్రజలు ఎలా బ్రహ్మరథం పడుతున్నదీ మీరు బహుశా రోజూ టీవీల్లో, పత్రికల్లో చూస్తూనే ఉండి ఉంటారు. అలాగే కేంద్ర మం త్రులు, ముఖ్యమంత్రి, ఒకనాటి ప్రముఖ సినీనటుడు, ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు సభలకు ప్రజలు పల చగా హాజరుకావడం చూస్తుంటే ప్రజలపై మీకు గల గౌర వం రెట్టింపై ఉంటుందని భావిస్తున్నాను.
మీరు ప్రజలను నమ్మారు. మీ తండ్రి ప్రజల కోసం పనిచేశారు. ప్రజలు మీకు, మీ కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచి తమ రుణం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. జనం ప్రభంజనం సృష్టించబోతున్నారు. ఆ ఆనందానుభూతిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి.
(ఈ ఉత్తరాన్ని ‘‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్లమెంటు సభ్యులు, చంచల్‌గూడ జైలు, హైదరాబాద్’’ చిరునామాకు రిజిస్టర్ పోస్టు విత్ అక్నాలెడ్జ్‌మెంట్ డ్యూతో పంపడమైనది.)

No comments:
Post a Comment