YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 6 June 2012

ఎమ్మిగనూరు జనసంద్రం.. పోటెత్తిన ఆళ్లగడ్డ

 కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన భూమా శోభానాగిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలని వైఎస్ విజయమ్మ ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘‘కర్నూలు జిల్లాతో తనకు అవినాభావ సంబంధం ఉందని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చెప్పేవారు. ముఖ్యమంత్రి అయ్యాకా ఆయన జిల్లాకు ఎంతో మేలు చేశారు. టీడీపీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో కేసీ కాల్వ రైతులకు ఏ ఒక్క సంవత్సరం కూడా రెండు పంటలకు నీళ్లు సరఫరా చేయలేదు. 

ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఏటా రెండు పంటలకు నీళ్లిచ్చారు.’’ అని పేర్కొన్న ఆమె జిల్లాతో వారి కుటుంబానికున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. తన కుమార్తె షర్మిలతో కలిసి బుధవారం రాత్రి ఆళ్లగడ్డలో నిర్వహించిన రోడ్‌షోలో అభిమాన కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పార్టీ అభ్యర్థి శోభా నాగిరెడ్డి, కేంద్ర పాలక మండలి సభ్యులు భూమా నాగిరెడ్డితో కలిసి వీరిద్దరూ సాయంత్రం 6.30 గంటలకు ఆళ్లగడ్డ చేరుకుని పడకండ్ల నుంచి రోడ్‌షో ప్రారంభించారు. అక్కడి నుంచి రహమాన్ బంకు, సంత మార్కెట్, పాత బస్టాండ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, పీబీ రోడ్డుల మీదుగా నాలుగు రోడ్ల కూడలికి చేరుకున్నారు. 

అక్కడ అశేష జనవాహినినుద్దేశించి విజయమ్మ, షర్మిల, శోభానాగిరెడ్డిలు ప్రసంగించారు. తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి జరుగుతున్న అన్యాయాలను, తన కుటుంబంపై జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలను ఉటంకిస్తూ విజయమ్మ ఉద్వేగంగా ప్రసంగించడం ప్రజలను కదిలించింది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజాప్రస్థాన పాదయాత్ర నుంచి ప్రారంభించి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చేపట్టిన సంక్షేమ పథకాలు, అనుమానాస్పద రీతిలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం, అనంతరం ఆయనపై, ఆయన కుటంబంపై కాంగ్రెస్, టీడీపీల కుట్రలు, కుతంత్రాలను ఆమె తన ప్రసంగంలో విడమరిచి చెప్పారు.

వైఎస్ అమలు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు. ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ ద్వారా అరెస్టు చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డలో విజయమ్మ ప్రచారం విజయవంతం కావడంతో కాం గ్రెస్, టీడీపీ నాయకుల్లో వణుకు మొద లైంది. రోడ్‌షోలో పార్టీ జిల్లా కన్వీనర్ గౌ రు వెంకట రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యు డు మూలింటి మారెప్ప పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!