YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 17 June 2012

ఇక బాదుడే! ఉప ఎన్నికల వల్ల ఆగిన సర్‌చార్జీల వసూలు..

ఇప్పుడు రూ. 7.5 వేల కోట్ల బాదుడుకు రంగం సిద్ధం

ఆగస్టు నుంచి రెండేళ్లపాటు వసూలు!
2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాలకు సర్దుబాటు చార్జీలు 
గృహ వినియోగదారులపైనే రూ. 2,390 కోట్ల మోత
2008-09లో గృహ వినియోగదారులపై సర్దుబాటు భారం మోపని వైఎస్... ఈసారి ప్రభుత్వం నుంచి అటువంటి హామీ లేదంటున్న ఇంధన శాఖ వర్గాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రజలకు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే ఆగస్టు నుంచి ఇంధన సర్దుబాటు చార్జీల (ఎఫ్‌ఎస్‌ఏ) రూపంలో యూనిట్‌కు 78.75 పైసల చొప్పున ఏకంగా 7,567.7 కోట్ల రూపాయుల భారం వేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. పరిశ్రవులు, వాణిజ్య సంస్థలతో పాటు గృహ వినియోగదారులకూ ఈ షాక్ గట్టిగానే తగలనుంది. ఒక్క గృహ వినియోగదారులపైనే రూ.2,390.63 కోట్ల భారం పడనుంది. 2010-11, 2011-12 ఆర్థిక సంవత్సరాల సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలను ఇప్పటికే విద్యుత్ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియుంత్రణ వుండలి (ఏపీఈఆర్‌సీ)కి సవుర్పించారుు. ఈ ప్రతిపాదనలపై వచ్చే నెల రెండో వారంలో ఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. ఆ తర్వాత నెల (ఆగస్టు) నుంచే సర్దుబాటు చార్జీల బాదుడు ప్రారంభవుయ్యే అవకాశాలు ఉన్నారుు. ఇప్పటికే ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీలు పెరిగాయి. పెరిగిన చార్జీల భారమే రూ.4,600 కోట్ల మేరకు ఉంది. ఈ భారాన్ని మోయలేక నానా ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలపై అదనపు వడ్డింపుగా సర్దుబాటు చార్జీలు తెరపైకి వచ్చారుు. వాస్తవానికి జూన్ నుంచే సర్దుబాటు చార్జీల బాదుడు ప్రారంభం కావాల్సి ఉంది. అరుుతే, ఉప ఎన్నికల నేపథ్యంలో ఇది వారుుదా పడింది. ఉప ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రజలను పీల్చి పిప్పిచేసే సర్దుబాటు చార్జీల ప్రతిపాదనలు ఈఆర్‌సీకి వెళ్లాయి.

రెండేళ్లపాటు బాదుడే బాదుడు

ఈ సర్దుబాటు చార్జీలను యూనిట్‌కు 78.75 పైసల చొప్పున వరుసగా 24 నెలలపాటు.. అంటే రెండేళ్లపాటు వసూలు చేయనున్నారు. అరుుతే, ఏడాదిలోనే (12 నెలల్లో) వీటిని వసూలు చేసుకునేందుకు ఈఆర్‌సీ అనువుతించే అవకాశవుూ లేకపోలేదని ఇంధనశాఖ వర్గాలు అంటున్నారుు. ఇదే జరిగితే యుూనిట్‌కు ఏకంగా రూ 1.57 చొప్పున భారం పడుతుంది. వాస్తవానికి 2008-09 ఆర్థిక సంవత్సరంలో గృహ వినియోగదారుల నుంచి రూ.506 కోట్ల మేరకు సర్దుబాటు చార్జీలను వసూలు చేయూల్సి ఉంది. అరుుతే, గృహ వినియోగదారులపై భారం పడకుండా... ఆ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీనిచ్చారు. ఫలితంగా గృహ వినియోగదారులకు ఊరట లభించింది. ఈసారి వూత్రం ప్రభుత్వం నుంచి అటువంటి హామీ ఏమీ లేదని ఇంధనశాఖ వర్గాలు తేల్చిచెప్పారుు. దీంతో గృహ వినియోగదారులకూ సర్దుబాటు పోటు తప్పదు. అదేవిధంగా 2009-10 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీల వసూలుకు హైకోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని విద్యుత్ సంస్థలు నిర్ణరుుంచారుు. ఈ చార్జీల వసూలుకు సుప్రీంకోర్టు అనుమతిస్తే వినియోగదారులపై మరో రూ.1,481 కోట్ల భారం పడనుంది. ఇందులో గృహ వినియోగదారుల నుంచి రూ.477 కోట్లు, పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారుల నుంచి రూ.1,003 కోట్ల మేర వసూలు చేస్తారు.
సర్దుబాటు చార్జీలు (ఎఫ్‌ఎస్‌ఏ) అంటే...!

ఇంధన సరఫరాలో వ్యత్యాసాల వల్ల విద్యుత్ కొనుగోలు ఖర్చులు మారుతూ ఉంటాయి. తక్కువ ధరకు ఉత్పత్తి అయ్యే హైడల్ (జల) విద్యుత్ తగ్గి.., బొగ్గు లేదా గ్యాసు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరిగితే ఆమేరకు ఉత్పత్తి ఖర్చు కూడా పెరుగుతుంది. దీంతోపాటు దేశీయ బొగ్గు అందుబాటులో లేని సమయంలో విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటారు. దిగుమతి చేసుకున్న బొగ్గు ధర దేశీయ ధరకంటే ఎక్కువ ఉంటుంది. దీని ఫలితంగా కూడా ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తికి వెచ్చించిన అదనపు ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేసే చార్జీలనే ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్‌ఎస్‌ఏ)గా వ్యవహరిస్తారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!