YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Tuesday, 5 June 2012

గాడిదలు కాయడానికి మంత్రులయ్యారా?

హైదరాబాద్: ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి సంతకం పెట్టమంటే తాము పెట్టామని చెబుతున్న మంత్రులు గాడిదలు కాయడానికి ఆ పదవులు స్వీకరించారా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు బాధ్యత వహించవలసిన మంత్రులు తప్పించుకుందామంటే కుదరదన్నారు. మొత్తం జగన్మోహన రెడ్డిపై నెట్టివేసి, వైఎస్ ని దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఉప ఎన్నికలలో వారు తమ తీర్పు ఇస్తారని చెప్పారు. 

రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు చిరంజీవికి లేదన్నారు. చిరంజీవి కూతురు ఇంట్లో 70 కోట్ల రూపాయలు దొరికాయి. దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఆయనకు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. జగన్ ఇంట్లో సిబిఐ వారు సోదాలు చేస్తే పది రూపాయలు గానీ, తులం బంగారం కానీ దొరకలేదన్నారు.

కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కయి జగన్ ని నిలువరించేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఆ రెండు పార్టీలు టూరింగ్ టాకీస్ డ్రామా ట్రూప్ లా తయారయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ ని జైలులో పెట్టినంతమాత్రాన ఆయన నేరం చేసిన వ్యక్తి కాదని స్పష్టం చేశారు. సిబిఐ కేంద్రం ఏది చెబితే అది చేస్తూ, కీలుబొమ్మలా తయాయిందన్నారు. 

వైఎస్ పథకాలు తమవి అని చెప్పుకునే కాంగ్రెస్ , ఇతర రాష్ట్రాలలో ఆ పథకాలు ఎందుకు అమలు చేయడంలేదని ఆయన ప్రశ్నించారు. వైఎస్ మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయని, తమ పార్టీ మొదటి నుంచి అనేకసార్లు అనుమానాలు వ్యక్తం చేసిందని చెప్పారు.

1 comment:

  1. When a minister says like this the officer says; I signed when the minister told. Where is the end? Is the PM happy with these kind of things? Of course the UPA chair person may not be concerned except looking after CBI.

    ReplyDelete

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!