YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Monday 18 June 2012

వైఎస్ జగన్ భద్రతపై బయటపడిన ప్రభుత్వ - పోలీసుల కుట్ర

గట్టి భద్రత కల్పించాలంటూ పోలీసులకు 9వ తేదీనే జైలు అధికారుల లేఖ
అయినా పక్కనబెట్టి వ్యాన్‌నుతీసుకొచ్చిన పోలీసులు
ఎన్నికల ముందు అవమానించటానికేనన్న జగన్‌మోహన్‌రెడ్డి
ఇకపై కోర్టుకు తీసుకొచ్చేటపుడు గట్టి భద్రత తప్పనిసరి.. 
సిటీ పోలీసు కమిషనర్‌కు సీబీఐ న్యాయమూర్తి ఆదేశాలు
ఆయన రాజకీయ, సామాజిక హోదాను దృష్టిలో పెట్టుకోవాలి
జైలు సూపరింటెండెంట్‌కు కూడా స్పష్టం చేసిన కోర్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికలకు ఒక్క రోజు ముందు.. భద్రతను గాలికి వదిలేసి.. సాధారణ క్రిమినల్ మాదిరిగా ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని పోలీసు వ్యాన్‌లో కోర్టుకు తరలించటం వెనక రాష్ట్ర ప్రభుత్వం- పోలీసులు కలిసి చేసిన కుట్ర బయటపడింది. తగినంత భద్రతను కల్పించాలని, పూర్తిస్థాయి పోలీసు ఎస్కార్ట్ ఉండాలని జైలు అధికారులు లిఖితపూర్వకంగా చెప్పినా కూడా పోలీసులు పట్టించుకోలేదన్న విషయం కోర్టు సాక్షిగా బయటపడింది.

జగన్‌మోహన్‌రెడ్డిని అవమానించి సంతృప్తి పడాలన్న రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యుల మనోభీష్టానికి అనుగుణంగానే పోలీసులు నడుచుకున్నారన్న అంశం తదుపరి పరిణామాలతో స్పష్టమయింది. తనను కోర్టుకు తరలించేటపుడు తగినంత భద్రత కల్పించలేదని, ఉద్దేశపూర్వకంగా తనను అవమానించటానికే క్రిమినల్స్‌ను తీసుకెళ్లే వ్యాన్‌లో తరలించారని జగన్‌మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి తీర్పు వెలువరించారు. ‘‘1979 నాటి ఆంధ్రప్రదేశ్ జైళ్ల నిబంధనల ప్రకారం అవకాశం ఉన్నపుడు కొంతమంది ఖైదీల విషయంలో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేయటం, తగినంత భద్రత కల్పించటం అన్నది పోలీసు అధికారుల విధి. ఆయన రాజకీయ, సామాజిక హోదా దృష్ట్యా ైవై.ఎస్.

జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక వాహనం కల్పించాలో లేక సాధారణ వ్యాన్‌లో తరలించాలో నిర్ణయించాల్సింది నగర పోలీసు కమిషనరే. అయితే అంతకన్నా ముందు భద్రతకు సంబంధించి ప్రత్యేక సదుపాయాలు అవసరమైతే.. వాటిని ఏర్పాటు చేయాలని పోలీసుల్ని జైలు అధికారులు కోరాల్సి ఉంటుంది. ఈ కేసులో చూసినపుడు జైలు అధికారులు ముందుగానే పోలీసులకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాసినట్లు స్పష్టమయింది. అందుకని ఇకపై వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని ఈ కోర్టు ఎదుట ఎప్పుడు హాజరుపరిచినా తగిన భద్రత కల్పించి తీసుకు రావాలని సిటీ పోలీసు కమిషనర్‌ను ఆదేశిస్తున్నాం. ఆయనకు కల్పించాల్సిన భద్రతను కూడా ఈ సందర్భంగా పోలీసులు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి’’ అని న్యాయమూర్తి ఎ.పుల్లయ్య తన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.

కుటుంబ సభ్యుల విషయంలో నిబంధనలు పాటించండి

తన భార్యను, కుటుంబ సభ్యుల్ని తరచూ కలవటానికి జైలు అధికారులు అనుమతించటం లేదని, ఈ విషయంలో కూడా తగిన ఆదేశాలివ్వాలని జగన్‌మోహన్‌రెడ్డి తన పిటిషన్లో కోరారు. దీనిపై న్యాయమూర్తి ఉత్తర్వులిస్తూ... వారంలో అన్నిరోజులూ కుటుంబ సభ్యుల్ని కలవాలంటే జైలు నియమాలు అంగీకరించవని స్పష్టంచేశారు. అయితే ఈ విషయంలో జైలు రూల్స్‌లోని 490, 506, 1038(6) నిబంధనల్ని తప్పనిసరిగా, కచ్చితంగా పాటించి తీరాలని చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను న్యాయమూర్తి ఆదేశించారు. 

పోలీసు కమిషనర్‌కు లేఖ రాసినా..

వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డిని న్యాయ స్థానానికి తరలించేటపుడు ఆయనకు గట్టి భద్రత, వాహనాలను సమకూర్చాలని ఈ నెల 9న నగర పోలీసు కమిషనర్‌కు తాను రాసిన లేఖను చంచల్‌గూడ జైలు ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్‌రెడ్డి సీల్డ్ కవర్‌లో పెట్టి.. న్యాయమూర్తి పుల్లయ్యకు సమర్పించారు. జగన్ భద్రత విషయంలో ఏర్పాటు చేయాలని తాము ముందుగానే నగర పోలీసులకు సమాచారం ఇచ్చామని, ఇందులో తమ పొరపాటేమీ లేదని ఆయన నివేదించారు. తమ లేఖ చూశాక ఆయన సామాజిక, రాజకీయ హోదాను దృష్టిలో పెట్టుకుని పోలీసులు వాహనాన్ని సమకూర్చి ఉండాల్సిందని వెంకటేశ్వర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇందులో తమ తప్పేమీ లేదని ఆయన స్పష్టంచేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!