విచారణకు హాజరైన ఆడిటర్ సాయిరెడ్డి
హైదరాబాద్, న్యూస్‌లైన్: కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ కస్టడీ గురువారం సాయంత్రంతో ముగియనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు బుధవారం వరకు నాలుగు రోజులపాటు ఆయనను విచారించారు. నాలుగు రోజులపాటు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ కొనసాగిన విచారణలో దర్యాప్తు అధికారులకు జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిగా సహకరించారు. చంచల్‌గూడలోని జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ కార్యాలయ ఆవరణలో మొదటిరోజు విచారించిన అనంతరం కోఠిలోని సీబీఐ కార్యాలయానికి విచారణ స్థలాన్ని మార్చారు. తర్వాత అక్కడే విచారణ కొనసాగింది. ఐదోరోజు కూడా కోఠి సీబీఐ కార్యాలయంలోనే విచారించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.
బుధవారం ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి బయటకు వచ్చినపుడు, విచారణ ముగిసిన తరువాత సాయంత్రం మళ్లీ జైలు లోపలికి వెళ్లే సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి కొద్దిసేపు బయట నిల్చుని అభివాదం చేశారు. రోజూ విచారణకు హాజరవుతున్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో కూడిన చిరునవ్వు మాత్రం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రెండో రోజు బుధవారం కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10.20 గంటలకు సీబీఐ కార్యాలయానికి వచ్చిన ఆయన మధ్యాహ్న భోజన విరామ సమయానికి తన వాహనంలోనే తిరిగి వెళ్లిపోయారు. ఆడిటర్ విజయసాయిరెడ్డి కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు. సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ, డీఐజీ హెచ్ వెంకటేష్, డీఎస్పీ ప్రవీణ్ ఉదయం నుంచి సాయంత్రం వరకూ సీబీఐ కార్యాలయంలోనే ఉన్నారు. లక్ష్మీనారాయణ నేతృత్వంలోనే బుధవారం విచారణ కొనసాగింది.

No comments:
Post a Comment