ఎమ్మిగనూరు, న్యూస్‌లైన్: అభిమానం పెల్లుబికింది. వైఎస్సార్ కుటుంబం పట్ల సర్కారు తీరుపై ఆవేదన కట్టలు తెంచుకుంది. ఎమ్మిగనూరు జనసంద్రమైంది. మిద్దెలు, మేడలు, చెట్లు.. పుట్టలు జనంతో పులకించాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సతీమణి, వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మిగనూరుకు చేరుకోవడంతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పార్టీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విజయమ్మతో పాటు కుమార్తె షర్మిల ప్రచారం నిర్వహించారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మిగనూరులోని శివ సర్కిల్ నుంచి విజయమ్మ రోడ్‌షో ప్రారంభమైంది. అప్పటికే నియోజకవర్గం నలుమూలల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. శివ సర్కిల్ నుంచి రోడ్‌షో ఆర్టీసీ బస్టాండు మీదుగా సోమప్ప సర్కిల్ చేరుకుంది. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ జనంలో కిక్కిరిశాయి.
ముఖ్యంగా మహిళలు విజయమ్మ, షర్మిలను చూసేందుకు పోటీపడ్డారు. సభా ప్రాంగణమైన సోమప్ప సర్కిల్ నుంచి దాదాపు కిలోమీటరు దూరం వరకు రోడ్లపై ఇసుకేస్తే రాలనంత జనం వైఎస్ కుటుంబంపై ప్రేమాభిమానాలకు నిదర్శనంగా నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ టీషర్టులు ధరించి, జెండాలు చేతబూని వైఎస్సార్ నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. మండుతున్న ఎండలో సుమారు గంటపాటు బహిరంగ సభ సాగినా ప్రజలు ఒక్క అడుగు ముందుకు వేయక వారి ప్రసంగాలను ఆసక్తి విన్నారు. అనంతరం ఎంబీ చర్జి మీదుగా గోనెగండ్ల మండలంలో రోడ్‌షో నిర్వహించారు.
క్రమశిక్షణతో మెలిగిన కార్యకర్తలు
వారం రోజులుగా వివిధ పార్టీల ప్రచారంలో డబ్బు, మద్యం పంపిణీ, చెప్పులు విసరడం తెలిసిందే. అయితే విజయమ్మ సభకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ కలిగిన సైనుకుల్లా వ్యవహరించారు. ఉక్కపోతతో ఒళ్లంతా చెమటలు పట్టినా కార్యకర్తలు.. విజయమ్మ, షర్మిల ప్రసంగాలయ్యేంత వర కు అంగుళం కూడా కదలకపోవడం విశేషం. కృష్ణ,మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్యాంతం ప్రచారంలోనే ఉండి జనాలను ఆక ట్టుకున్నా రు. మహిళలు పెద్ద సంఖ్యలో విజయమ్మ ప్రచార రథం వద్దకు చేరుకుని అభినందనలు తెలిపేందుకు ఎగబడ్డారు. తన వద్దకు వచ్చిన వారికి ఆమె అంతే ఆత్మీయతతో అభివాదం చేశారు.
అన్నీ తండ్రి హావభావాలే
షర్మిల మాటలు, అభివాదం, అన్నీ తండ్రి వైఎస్‌లాగే ఉన్నాయని సభ అనంతరం ఎమ్మిగనూరు ప్రజలు చర్చించుకున్నారు. తాను అధికార ప్రతిపక్షాలను అడగదల్చుకున్నది సూటిగా ప్రశ్నించ డం, ప్రజలకు ఏమి చెప్పదల్చుకుందో వినయంగా వారికి వివరించడం జనాన్ని ఆకట్టుకుంది. షర్మిల మాట్లాడుతున్నంత సేపూ జనం ఉద్వేగానికి లోనయ్యారు. మీ వైఎస్సార్ కూతుర్ని, మీ జగనన్న చెల్లెల్ని.. షర్మిలను అని మొదలైన ప్రసంగం.. వైఎస్‌ను అభిమానించే మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ముగించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, నేతలు ఎస్వీ మోహన్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, గౌరుచరిత, గౌరు వెంకటరెడ్డి, కోట్ల హరిచక్రపాణిరెడ్డి, నిడ్జూరు రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, అజయ్‌కూమార్, నరవ రమాకాంత్‌రెడ్డి, కడిమెట్ల దయాకర్‌రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment