YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Wednesday, 6 June 2012

సత్తిబాబు డెరైక్షన్.. చిరు యూక్షన్

అనుకున్నంతా అయ్యింది.. వద్దు వద్దంటూనే ఎన్నికల ప్రచారం ఆఖరి దశలో ‘అన్నయ్య’ వచ్చాడు. ఆయన రోడ్ షో అంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల నిర్వహించిన దారిలోనే సాగింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ (సత్తిబాబు) డెరైక్షన్‌లో చిరంజీవి యూక్షన్ చేసుకుంటూ నిర్వహించిన ‘షో’కు జనస్పందన లభించలేదు. పస లేని ఉపన్యాసం.. ఫలితం లేని ప్రచారంలా మిగిలింది. చిరు సొంత నియోజకవర్గమైన నరసాపురంలో ఆయనకు ఆదరణ లేదనే విషయం మరోసారి తేటతెల్లమైంది.

నరసాపురం/ నరసాపురం రూరల్ , న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రోడ్ షోతో కకావికలమైన కాంగ్రెస్ నేతలు చిరంజీవితో పోటీ రోడ్ షో నిర్వహించారు. చిరంజీవి నరసాపురం నియోజకవర్గానికి వస్తే ఉన్న ఓట్లే గల్లంతయ్యే ప్రమాదం ఉందని ముందునుంచే భయపడిన అభ్యర్థి కొత్తపల్లి సుబ్బా రాయుడు అనుయూయులు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా వెంట తెచ్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం వైఎస్ విజయమ్మ గొంది గ్రామం నుంచి రోడ్‌షోకు శ్రీకారం చుట్టగా, చిరంజీవి స్వగ్రామం మొగల్తూరు నుంచి నరసాపురం వరకు ఆమెకు విశేష స్పందన లభించింది. చిరంజీవి, బొత్స మాత్రం మొగల్తూరు మినహా విజయమ్మ దారిలోనే ఎక్కువ శాతం రోడ్ షో సాగించారు. మండే ఎండను తట్టుకోలేక ఊరిలో కారుపైనా.. ఊరు దాటాక బస్సులోకి... అన్న తీరులో వారు రోడ్ షో నిర్వహించారు.

రోడ్ షోలో సైతం చిరంజీవికి ఏమాత్రం చిరాకు తగ్గలేదు. కరచాలనం చేసేందుకు వచ్చిన అభిమానులను సైతం తోసేయడం, అవ్వలను, పేదలను ముట్టుకుని తర్వాత బస్సులోకి వెళ్లి చేతులు కడుక్కోవడం వంటి ఆయన చర్యలతో జనం విస్తుపోయారు. చిట్టవరం గ్రామంలో అభిమాని ఒకరు కరచాలనం కోసం కారు దగ్గరకు జనం మధ్యలో నుంచి కష్టపడి వస్తే చిరంజీవి చిరాకుపడి అతడిని పక్కకు నెట్టేశారు. రాష్ట్రంలోనే తొలిసారిగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో చిట్టవరం యువకులు గ్రంథాలయాన్ని నిర్మించి అక్కడ మహిళలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి గతంలో శ్రీకారం చుట్టారు. అటువంటి గ్రామంలో వీరాభిమాని అయిన తనకు పరాభావం జరిగిందని రమేష్ అనే యువకుడు వాపోయాడు. అదే గ్రామంలో ఎంతో ప్రేమతో మహిళలు హారతి ఇచ్చేందుకు కారు దగ్గరకు రాగా చిరంజీవి తిరస్కరించి ముందుకు వెళ్లిపోయారు. 

తొలుత గొంది శివారు ప్రాంతంలో ఓ దళితుల ఇంట వివాహ వేడుక జరుగుతుండడంతో ఆ జనంలోకి వెళదామంటూ బాపిరాజు కోరగా ‘వాళ్లు మనకు ఓటెయ్యరు ఎందుక’ంటూ చిరంజీవి విసురుగా అన్నారు. నరసాపురం శివారు చినమామిడిపల్లిలో ఉంటున్న కాలనీకి వెళ్లిన చిరంజీవి అక్కడి వృద్ధులు, చిన్నారులను పట్టుకుని పలకరించారు. వెనుదిరిగి వచ్చిన వెంటనే బస్సులోని లిక్విడ్‌తో ఆయన చేతులు శుభ్రం చేసుకోవడంతో అభిమానులు విస్తుపోయారు. సరిపల్లి ప్రాంతంలో ఓ అభిమాని చిరును ఉద్దేశించి ‘మీరు కోపం తగ్గించుకోకుంటే రాజకీయంగా ఎదగర’ని ఘాటుగా సలహా ఇవ్వడమే కాకుండా ‘మీరైనా చెప్పి చిరంజీవిలో మార్పు తెండి’ అంటూ బొత్సకు సూచించడంతో విస్తుపోవడం రోడ్ షోలో పాల్గొన్న నాయకుల వంతయ్యింది. కాగా, చిరంజీవి టూర్ మొత్తం సత్తిబాబు డెరెక్షన్‌లోనే సాగడం అందుకు అనుగుణంగా ఆయన యూక్షన్ చేయడం జరిగిపోయింది. 

సుబ్బారాయుడు వాహనమా.. అయితే ఓకే
ఇటీవల వైఎస్ విజయమ్మ నిర్వహించిన రోడ్ షోలో చెక్‌పోస్టుల వద్ద అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీస్ యంత్రాంగం చిరంజీవి, బొత్స టూర్‌లో చూసీచూడనట్లుగా వ్యవహరించారు. నరసాపురం చెక్‌పోస్టు వద్ద చిరంజీవి వాహనానికి ముందుగా వచ్చిన వాహనాన్ని పోలీసులు తనిఖీలు చేసే ప్రయత్నం చేశారు. ఆ దశలో అది కొత్తపల్లిది అని చెప్పడంతో ఆ వాహనంలో ఉన్న రెండు సూట్‌కేసులను తనిఖీ చేయకుండానే పోలీసులు వదిలేయడం విమర్శలకు తావిచ్చింది. విజయమ్మ వాహనంలో సూట్‌కేసుల్లో ఉన్న దుస్తులను మగ పోలీసులే తనిఖీ చేసి అతిగా ప్రవర్తించగా, సుబ్బారాయుడు వాహనం అని చెప్పగానే అయితే ఓకే అంటూ పోలీసులు సాగనంపడం అధికార పక్షంపై వారికున్న ప్రేమను రుజువు చేస్తోంది. చిరంజీవి వాహనాన్ని కొత్తపల్లి వద్దంటున్నా ప్రత్యేకంగా తనిఖీ చేయించుకున్నారు. 

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!