YSR Congress

News and Information portal

ysrcongress.in - News and Information portal

Sunday, 10 June 2012

తిరుపతితో వైఎస్‌కు వీడని బంధం

 ‘‘మీతో వైఎస్ రాజశేఖరరెడ్డికి వీడదీయరాని బంధం ఉంది. ఈ జిల్లాతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. ఎంతో మందిని ఆయన పేరు పెట్టి పిలిచేవారు. తిరుపతి అభివృద్ధి కోసం పని చేశారు. ఆయన డాక్టర్‌గా హౌస్ సర్జన్ చేసే సమయం లో సంవత్సరం పాటు ఇక్కడే ఉన్నారు. చివరిసారిగా ఆయన్ను చూసింది ఈ జిల్లాకు రచ్చబండకు రావాలని బయల్దేరినప్పుడే, అది తల్చుకున్నప్పుడు మనసుకు బాధేస్తుంది. ఆ దుర్ఘటన గుర్తుకొస్తుంది. మా కుటుంబంతో 35 ఏళ్లుగా అనుబంధం ఉన్న వ్యక్తి, రాజశేఖరరెడ్డిని నమ్మినవారిలో ఒకరు, మంచిమనిషి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి భూమన కరుణాకరరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా’’ అంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్‌కు జిల్లాతో ఉన్న అనుబంధాన్ని, తిరుపతి నగర అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. ఆదివారం తిరుపతి లీలామహల్ సర్కిల్‌లో నిర్వహించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముగింపు సభలో విజయమ్మ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘వైఎస్‌ను ప్రేమించే ప్రతి హృదయం తిరుపతి ఉప ఎన్నికల్లో కరుణాకరరెడ్డికి ఓటు వేసి గెలిపించాలి. మీరు వేసే ఈ ఓటే జగన్‌ను బయటకు రప్పిస్తుంది.’’ అని చెప్పారు.

ఈ జిల్లా కోసం మొదటి నుంచి రాజశేఖర రెడ్డి ఏదో చేయాలని తపన పడేవారని, ఇక్కడి వారితో అటువంటి అనుబంధం ఉండేదన్నారు. జిల్లా అభివృద్ధికి కీలకంగా ఉన్న మన్నవరం భెల్ ఫ్యాక్టరీని తెచ్చింది వైఎస్సేనన్నారు. ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 20 వేల మందికి ఉపాధి కలుగుతోందని గుర్తు చేశారు. తిరుపతిలో నూతన మెటర్నిటీ ఆసుపత్రిని, వేద విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారని తెలిపారు. తిరుపతి నగరాన్ని మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చారని పేర్కొన్నారు. తిరుపతిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం మిషన్ సిటీగా చేర్పించారన్నారు. ఆయన రూ.2200 కోట్లకుపైగా నిధులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం రూ.240 కోట్లు మాత్రమే విడుదల చేసిందని గుర్తు చేశారు. 

రాజశేఖర రెడ్డి పేదలు, రైతుల సంక్షేమం గురించి ఆలోచిం చేవారని చెప్పారు. ఆ ఆలోచనల నుంచి పుట్టినవే సంక్షేమ పథకాలు. పేదలు, రైతులకు, మహిళలకు లబ్ధి చేకూరే విధంగా ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, కిలో రూ.2 బియ్యం, ఆరోగ్యశ్రీ వంటివి తెచ్చారని గుర్తు చేశారు. ఇప్పటి ప్రభుత్వం వ్యవసాయానికి విద్యుత్ ఏడు గంటలు ఇస్తామని, మూడున్నర గంటలు కూడా ఇవ్వటం లేదని విమర్శించారు. ప్రస్తుతం 108 అంబులెన్స్ ఫోన్ చేస్తే వస్తుందో రాదో తెలియని స్థితి నెలకొందన్నారు. 104 ఆరోగ్య సేవలను రద్దు చేశారని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోతలు విధిస్తున్నార ని ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment

Subscribe to our RSS Feed! Follow us on Facebook! Follow us on Twitter! Visit our LinkedIn Profile!