ఎన్నిల సంఘానికి వచ్చిన ఫిర్యాదుల మీద జిల్లా స్థాయిలో ఉన్న కమిటీ విచారణ జరిపి నిర్ణయాలు తీసుకుంటుందని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధాన అధికారి భన్వర్ లాల్ చెప్పారు. ఈ కమిటీ నిర్ణయాలు నచ్చకపోతే రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘంలో ఉన్న కమిటీకి అప్పీల్ చేసుకోవచ్చని వివరించారు. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఫిర్యాదులను వందకు వంద శాతం పరిష్కరించామని ఆయన వెల్లడించారు.
అభ్యర్థులు పెడుతున్న ఖర్చును తెలుసుకోవడానికి ప్రతి నియోజకవర్గానికి ఎన్నికల సంఘం ఒక పరిశీలకుడిని పంపుతుందని చెప్పారు. పరిశీలకుడు ఇచ్చే లెక్కలకు, అభ్యర్థి ఇచ్చే లెక్కలకు తప్పనసరిగా పొంతన కుదరాలని ఆయన తెలిపారు. అభ్యర్థి తన పరిమితికి మించి ఖర్చు పెడితే ఆ అభ్యర్థిపై అనర్హత వేటు పడుతుందని హెచ్చరించారు.

No comments:
Post a Comment